IPL 2024 : మూడ్రోజులు బెడ్‌పైనే ఉన్నా..! మ్యాచ్ తరువాత ఎమోషనల్ అయిన రియాన్ పరాగ్

గత రెండు ఐపీఎల్ సీజన్లలో తన చెత్త ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న రియాన్ పరాగ్.. ఢిల్లీ క్యాపిటల్స్ పై మ్యాచ్ లో అద్భుత ఆటతీరుతో రాణించాడు.

IPL 2024 : మూడ్రోజులు బెడ్‌పైనే ఉన్నా..! మ్యాచ్ తరువాత ఎమోషనల్ అయిన రియాన్ పరాగ్

Riyan Parag

Riyan Parag : ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. ఆర్ఆర్ జట్టు బ్యాటర్ రియాన్ పరాగ్ అద్భుత బ్యాటింగ్ చేశాడు. కేవలం 45 బంతుల్లో ఏడు ఫోర్లు, ఆరు సిక్సుల సహాయంతో 84 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. పరాగ్ దూకుడైన బ్యాటింగ్ తో ఆర్ఆర్ జట్టు మంచి స్కోర్ సాధించగలిగింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసినా డీసీ జట్టు చివరి వరకు పోరాడి ఓటమి పాలైంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు వరుసగా రెండో విజయాన్ని దక్కించుకుంది.

Also Read : IPL 2024 : ఐపీఎల్‌లో ‘హోమ్‌గ్రౌండ్‌’ జట్లదే హవా.. తొమ్మిది మ్యాచ్‌ల‌లో విజేతలు వారే..!

గత రెండు ఐపీఎల్ సీజన్లలో తన చెత్త ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న రియాన్ పరాగ్.. ఢిల్లీ క్యాపిటల్స్ పై మ్యాచ్ లో అద్భుత ఆటతీరుతో రాణించాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అయితే, మ్యాచ్ అనంతరం రియాన్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ మ్యాచ్ కు ముందు మూడు రోజులు నేను బెడ్ పైనే ఉన్నా.. పెయిన్ కిల్లర్స్ ను వాడా. రెండో మ్యాచ్ కోసం తీవ్రంగా కష్టపడ్డా. ఇప్పుడు ఆ ఫలితం అందుకున్నందుకు ఆనందంగా ఉందని రియాన్ అన్నాడు. అయితే, బావోద్వేగాలను నియంత్రించుకోవటం నాకు అలవాటైపోయిందని అన్నాడు. మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. గత నాలుగేళ్లుగా నా కష్టాలను ప్రత్యక్షంగా చూశారు అంటూ రియాన్ పేర్కొన్నాడు.

Also Read : IPL 2024 : రెచ్చిపోయిన రియాగ్.. ఢిల్లీపై రాజస్థాన్ రాయల్స్ విజయం

నాపై ఆత్మవిశ్వాసం ఎప్పుడూ తగ్గలేదు. నేను డకౌట్ అయినా అలాగే ఉంటా. దేశవాలీ క్రికెట్ లో మెరుగైన ప్రదర్శన ఇవ్వడం ద్వారా ఐపీఎల్ లో అవకాశం వచ్చింది. నాల్గో స్థానంలో బ్యాటింగ్ కు వస్తే  20 ఓవర్లు  క్రీజులో నిలబడితే మెరుగైన స్కోర్ చేయొచ్చు.. సంజూ మొదటి మ్యాచ్ లో అలానే చేశాడు. నేను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై అలానే చేశా అని రియాన్ పరాగా అన్నాడు.