Sachin Tendulkar : కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించారని ముంబైని వీడనున్న సచిన్..? నిజమెంతంటే..?
Sachin Tendulkar - Rohit Sharma : ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది.

IPL 2024 Sachin Tendulkar parts ways with Mumbai Indians
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యకు బాధ్యతలను అప్పగించింది. ముంబై తీసుకున్న ఈ నిర్ణయం పై క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. కెప్టెన్‌గా రోహిత్ ను తప్పించడం పట్ల ఆ జట్టు మెంటార్ సచిన్ అసంతృప్తిగా ఉన్నాడని, ఈ క్రమంలో తన మెంటార్ పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి తెలియజేసినట్లు ఆ వార్తల సారాంశం. గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా.. ఈ క్రమంలో ఓ జాతీయ మీడియా ఛానెల్ ఇదే విషయం పై సచిన్ టెండూల్కర్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.
?Breaking News?
Sachin Tendulkar stepped down from mentor role of Mumbai Indians.
RIP MUMBAI INDIANS pic.twitter.com/qKq17TQF60
— Shubham ? (@DankShubhum) December 16, 2023
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా ఐపీఎల్ 2024 సీజన్‌కు కూడా ముంబై జట్టుకు మెంటార్‌గా సచిన్ టెండూల్కర్ కొనసాగనున్నాడని పలు రిపోర్టులు పేర్కొన్నాయి.
? SACHIN TENDULKAR STEP DOWNS
It Seems like Sachin Sir was also not in favour to make Hardik Captain over Rohit Sharma or Trade Hardik for Captaincy.
One family is ruined by a Snake ???UNFOLLOW MUMBAI INDIANS pic.twitter.com/zRjkn2niia
— Abhishek ?? (@ImAb_45) December 17, 2023
ముంబైతో సచిన్ కు సుదీర్ఘ అనుబంధం..
సచిన్ టెండూల్కర్‌కు ముంబై ఇండియన్స్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్ అయిన 2008 నుంచి 2013 వరకు ఓ ఆడిగాడిగా ముంబై జట్టులో సచిన్ కొనసాగాడు. పలు సీజన్లకు ముంబై జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. మొత్తం 78 మ్యాచుల్లో 33.83 సగటుతో 2,334 పరుగులు చేశాడు. ఓ సెంచరీ, 13 అర్థశతకాలు చేశాడు. ఇక ఆటకు రిటైర్‌మెంట్ ప్రకటించిన అనంతరం సచిన్ 2014 నుంచి ముంబై జట్టు మెంటార్‌గా సచిన్ సేవలు అందిస్తున్నాడు.
Team India : ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్.. టీమ్ఇండియాకు కలిసొచ్చిన అదృష్టం