IPL 2025: టేబుల్ టాపర్ గుజరాత్‌కు బిగ్ షాక్ ఇచ్చిన చెన్నై.. ఘన విజయంతో టోర్నీ నుంచి నిష్క్రమణ..

ఫలితంగా 83 పరుగుల తేడాతో చెన్నై ఘన విజయం నమోదు చేసింది.

IPL 2025: టేబుల్ టాపర్ గుజరాత్‌కు బిగ్ షాక్ ఇచ్చిన చెన్నై.. ఘన విజయంతో టోర్నీ నుంచి నిష్క్రమణ..

Courtesy BCCI

Updated On : May 25, 2025 / 11:05 PM IST

IPL 2025: కీలక మ్యాచ్ లో గెలిచి పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుదామనుకున్న గుజరాత్ టైటాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్. తన ఆఖరి మ్యాచ్ లో సీఎస్ కే దుమ్ములేపింది. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. 231 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. 147 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫలితంగా 83 పరుగుల తేడాతో చెన్నై ఘన విజయం నమోదు చేసింది. జీటీ బ్యాటర్లలో సాయి సుదర్శన్(41) మినహా ఎవరూ రాణించలేదు.

తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్ కే 20ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగుల భారీ స్కోర్ చేసింది. తొలుత బ్యాటర్లు దుమ్మురేపారు. ఆ తర్వాత బౌలర్లు తడాఖా చూపించారు. సీఎస్ కే బౌలర్లలో అనుష్ కాంబోజ్, నూర్ అహ్మద్ తలో మూడు వికెట్లు తీసుకున్నారు. జడేజా 2 వికెట్లు తీశాడు. ఖలీల్ అహ్మద్, పతిరణ చెరో వికెట్ పడగొట్టారు.

గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ దశ చేరుకుంది. తన చివరి లీగ్ మ్యాచ్ లో గెలిచి పాయింట్ల పట్టికలో టాపర్ గా కంటిన్యూ అలని కలలు కంది. అయితే, ఊహించని రీతిలో చెన్నై సూపర్ కింగ్స్.. గుజరాత్ కు బిగ్ షాక్ ఇచ్చింది. జీటీ ఆశలపై నీళ్లు చల్లింది. గుజరాత్ తర్వాత ప్లేస్ లో పంజాబ్, బెంగళూరు, ముంబై జట్లు ఉన్నాయి. ఈ జట్లు మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అందులో అవి కనుక గెలిస్తే.. పాయింట్ల టేబుల్ లో మార్పులు జరిగే అవకాశం ఉంది. జీటీ తన నెంబర్ 1 స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

సీఎస్ కే ఈ సీజన్ లో దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు కేవలం 4 విజయాలే సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. సీజన్ మధ్యలోనే రెగులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో తప్పుకోవడంతో మహేంద్ర సింగ్ ధోనీ జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ సీజన్ ఆరంభం నుంచి పేలవ ప్రదర్శన చేసిన సీఎస్ కే.. టేబుల్ టాపర్ కు షాక్ ఇస్తూ ఘన విజయంతో టోర్నీకి ముగింపు పలకడం అభిమానుల్లో ఆనందం నింపింది.

Also Read: థ‌ర్డ్ అంపైర్ పై ప్రీతి జింటా ఆగ్ర‌హం.. క‌రుణ్ నాయ‌ర్ కూడా చెప్పాడు..