IPL 2025: వాటే మ్యాచ్.. ఉత్కంఠ పోరులో ముంబైపై గుజరాత్‌దే గెలుపు.. టేబుల్ టాపర్ GT
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.

Courtesy BCCI
IPL 2025 : ముంబై ఇండియన్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ గెలుపొందింది. డక్ వర్త్ లూయిస్ లో ఫలితం తేలింది. వర్షం కారణంగా మ్యాచ్ ను 19 ఓవర్లకు కుదించారు. గుజరాత్ కు 147 పరుగుల టార్గెట్ నిర్దేశించారు. చివరి ఓవర్ లో 15 పరుగులు చేసి అద్భుత విజయం సాధించింది జీటీ. మూడు వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
వర్షం అంతరాయంతో మ్యాచ్ ని 19 ఓవర్లకు కుదించారు. చివరి ఓవర్లో గుజరాత్ టార్గెట్ 15 పరుగులు. దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్ లో టార్గెట్ ను ఛేజ్ చేసింది గుజరాత్. 7 వికెట్లు కోల్పోయి చివరి బంతికి ఛేదించింది.
Also Read: శుభ్‌మన్ గిల్ పై నాయకత్వ ఒత్తిడి పడుతోందా?
గుజరాత్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (43), బట్లర్(30), రూథర్‌ఫోర్డ్ (28) రాణించారు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, అశ్విని కుమార్ తలో రెండు వికెట్లు తీశారు. దీపక్ చాహర్ ఒక వికెట్ తీశాడు.
ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. 14 పాయింట్లతో టేబుల్ లో 4వ స్థానానికి దిగింది. అటు గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో టేబుల్ లో టాపర్ గా ఉంది.