Ishant Sharma: ఇషాంత్ శర్మకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. భారీగా జరిమానా.. కారణమేమంటే?

గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఇషాంత్ శర్మకు బీసీసీఐ బిగ్ షాకిచ్చింది. భారీగా జరిమానా విధించింది.

Ishant Sharma: ఇషాంత్ శర్మకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. భారీగా జరిమానా.. కారణమేమంటే?

Ishant Sharma

Updated On : April 7, 2025 / 12:25 PM IST

Ishant Sharma: ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు విజయం సాధించింది. అయితే, ఆ జట్టు బౌలర్ ఇషాంత్ శర్మకు బీసీసీఐ బిగ్ షాకిచ్చింది. రిఫరీ నిర్ణయంపై ఇషాంత్ అసహనం వ్యక్తం చేయడంతో బీసీసీఐ సీరియస్ అయింది.

Also Read: IPL 2025: నిప్పులుచెరిగే బంతులతో స‌న్‌రైజ‌ర్స్‌ బ్యాటర్లను అల్లాడించిన సిరాజ్.. ఐపీఎల్ లో అరుదైన రికార్డు నమోదు

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఇషాంత్ శర్మ ఉల్లంఘించినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై ఐపీఎల్ ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. మ్యాచ్ ఫీజులో 25శాతం కోత విధించింది. ఓ డీమెరిట్ పాయింట్ కూడా అతని ఖాతాలోకి వెళ్లింది. ఐపీఎల్ లోని ఆర్టికల్ 2.2 ఉల్లంఘించిన లెవల్ 1 అఫెన్స్ కు ఇషాంత్ పాల్పడినట్లు తెలిపారు. క్రికెట్ సామాగ్రిని కానీ, దుస్తుల్ని కానీ, గ్రౌండ్ ఈక్విప్మెంట్ పట్ల కానీ అమర్యాదకరంగా ప్రవర్తిస్తే అప్పుడు ఆర్టికల్ 2.2 కింద జరిమానా విధిస్తారు. అయితే, లెవల్ 1 నేరాన్ని ఇషాంత్ అంగీకరించాడు. మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ విధించిన ఫైన్ ను ఆమోదించాడు.

Also Read: IPL 2025: బుమ్రా సరే.. రోహిత్ శర్మ పరిస్థితి ఏమిటి..? హిట్‌మ్యాన్‌ను పక్కన పెట్టినట్లేనా.. బిగ్ అప్‌డేట్‌

ఇషాంత్ శర్మను గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ మెగావేలంలో రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో ఇషాంత్ శర్మ నాలుగు ఓవర్లు వేసి 53 పరుగులు ఇచ్చాడు. అతను ఈ సీజన్ లోని మూడు మ్యాచ్ లలో ఎనిమిది ఓవర్లు వేసి 108 రన్స్ సమర్పించుకున్నాడు. కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్నాడు.