IPL 2025: గ్రౌండ్‌లో కొట్టుకున్నంత ప‌నిచేశారు..! అభిషేక్ శ‌ర్మ‌, దిగ్వేశ్ మ‌ధ్య‌ తీవ్ర వాగ్వాదం.. చివరిలో బిగ్ ట్విస్ట్.. వీడియో వైర‌ల్

ఐపీఎల్ -2025లో భాగంగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ, దిగ్వేశ్ రాఠిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

IPL 2025: గ్రౌండ్‌లో కొట్టుకున్నంత ప‌నిచేశారు..! అభిషేక్ శ‌ర్మ‌, దిగ్వేశ్ మ‌ధ్య‌ తీవ్ర వాగ్వాదం.. చివరిలో బిగ్ ట్విస్ట్.. వీడియో వైర‌ల్

BCCI Credit

Updated On : May 20, 2025 / 6:57 AM IST

IPL 2025: ఐపీఎల్ -2025లో భాగంగా సోమవారం సాయంత్రం లక్నో సూపర్ జెయింట్స్ (LSG), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. దీంతో లక్నో జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. ఈ మ్యాచ్ లో తొలుత లక్నో జట్టు బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 18.2 ఓవర్లలోనే 206 పరుగులు చేసి విజేతగా నిలిచింది. అయితే, ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ, దిగ్వేశ్ రాఠి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది.

Also Read: IPL 2025 : హైదరాబాద్ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ నుంచి లక్నో నిష్క్రమణ

అభిషేక్ శ‌ర్మ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడాడు. ఈ క్ర‌మంలో కేవ‌లం 20 బంతుల్లోనే 59 ప‌రుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, ఆరు సిక్సులు కొట్టాడు. దిగ్వేశ్ రాఠి బౌలింగ్ లో భారీ షాట్ కు ప్ర‌య‌త్నించి ఔట్ అయ్యాడు. బౌండ‌రీ లైన్ వ‌ద్ద శార్దూల్ ఠాకూర్ క్యాచ్ ప‌ట్టాడు. దీంతో దిగ్వేశ్ రాఠి నోటుబుక్ సంబ‌రాలు చేసుకున్నాడు. పెవిలియన్ వైపువెళ్తున్న అభిషేక్ అతడిని చూస్తూ ఏదో అన్నాడు. దీంతో దిగ్వేశ్ దూకుడుగా అభిషేక్ వైపు దూసుకెళ్లి వాగ్వాదానికి దిగాడు. కొద్దిసేపు వారిద్దరి మధ్య మాటల యుద్ధం సాగింది. లక్నో కెప్టెన్ రిష‌బ్ పంత్‌, ఆ జట్టు ప్లేయ‌ర్లు, అంపైర్లు వారిని అడ్డుకున్నారు. అభిషేశ్ శ‌ర్మ సీరియ‌స్ గా అక్క‌డి నుంచి పెవిలియ‌న్ కు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read: Virat kohli : కోహ్లీ టెస్టు రిటైర్‌మెంట్ వెనుక ఉన్న అస‌లు కార‌ణం ఇదేనా? భ‌య‌ప‌డ్డాడా?

దిగ్వేశ్‌ వేసిన మ‌రో ఓవ‌ర్లో ఇషాన్ కిష‌న్ (35) అవుట్ అయ్యాడు. ఆ స‌మ‌యంలోనూ దిగ్వేశ్ పెవిలియ‌న్ వైపు చూస్తు నోట్‌బుక్ సంబరాలు చేసుకున్నాడు. ఈ క్ర‌మంలో రిష‌బ్ పంత్ దిగ్వేశ్ ను మంద‌లించిన‌ట్లు క‌నిపించింది. అయితే, మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ప్లేయర్లు షేక్‌హ్యాడ్ ఇచ్చుకునే క్రమంలో దిగ్వేశ్, అభిషేక్ ఎదురు‌పడ్డారు. ఈ క్రమంలోనూ వారిద్దరి మధ్య కాస్త ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఆ తరువాత ఇద్దరు ప్లేయర్లు మళ్లీ యథావిధిగా మాట్లాడుకోవటం కనిపించింది.

ఐపీఎల్ -18లో ఆరంభం నుంచి తన సంబరాలతో లక్నో జట్టు స్పిన్నర్ దిగ్వేశ్ రాఠి వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నాడు. ఇప్పటికే పలుమార్లు భారీగా జరిమానా కూడా కట్టాడు. అయినా కూడా అతడు ఆ సంబరాలను ఆపలేదు. తాజాగా… సన్ రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనూ ఇదే విధంగా ప్రవర్తించడంతో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మందలించినట్లు కనిపించింది.