IPL 2025 : ఢిల్లీ జైత్రయాత్రకు ముంబై బ్రేక్.. తొలి ఓటమి నమోదు
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.

Courtesy BCCI
IPL 2025 : ఐపీఎల్ 2025 సీజన్ 18లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ముంబై ఇండియన్స్ ఢిల్లీకి షాక్ ఇచ్చింది. ఓటమి రుచి చూపించింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీపై ముంబై విక్టరీ కొట్టింది. 12 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది ముంబై. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. 193 పరుగులకే పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఈ సీజన్ లో ఢిల్లీకి ఇదే తొలి ఓటమి. వరుసగా నాలుగు మ్యాచులు గెలిచిన ఢిల్లీ.. తొలి ఓటమిని చవిచూసింది.
ఢిల్లీ బ్యాటర్ కరుణ్ నాయర్ కష్టం వృథా అయ్యింది. కరుణ్ నాయర్ చెలరేగి ఆడినా.. ఢిల్లీ ఓటమిని తప్పించలేకపోయాడు. వరుసగా వికెట్లు పడటంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. కరుణ్ నాయర్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. 40 బంతుల్లోనే 89 పరుగులు బాదాడు. 5 సిక్సులు, 12 ఫోర్లు కొట్టాడు. కరుణ్ నాయర్ దూకుడుతో ఢిల్లీ గెలుపు ఖాయమని ఫ్యాన్స్ భావించారు. అయితే నాయర్ ఔట్ కావడంతో అంతా తారుమారైపోయింది. ముంబై బౌలర్లలో కర్ణ్ శర్మ 3 వికెట్లు తీశాడు. మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్, బుమ్రా చెరో వికెట్ తీశారు.
Also Read : ఐపీఎల్ 2025లో భారీగా జరిమానాలు పడింది ఈ ఏడుగురికే.. ఎందుకంటే? ఫుల్ లిస్ట్..
ఈ సీజన్ లో ఢిల్లీకి ఇదే తొలి పరాజయం. వరుసగా నాలుగు మ్యాచులు నెగ్గిన ఢిల్లీ తన ఐదో మ్యాచ్ లో ముంబై చేతిలో పరాజయం పాలైంది. ఈ ఓటమితో పాయింట్ల టేబుల్ లో అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి దిగింది. గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలోకి వెళ్లింది. అటు ముంబై ఇండియన్స్ కి ఈ సీజన్ లో ఇది రెండో గెలుపు. ఇప్పటివరకు ఆరు మ్యాచులు ఆడిన ముంబై.. నాలుగింటిలో ఓడిపోయింది. పాయింట్ల టేబుల్ లో 7వ స్థానానికి చేరింది.