IPL 2025: మారని హైదరాబాద్ తీరు.. మరో ఘోర పరాజయం

Courtesy BCCI
IPL 2025: హైదరాబాద్ సన్ రైజర్స్ తీరు మారలేదు. పరాజయం పరంపర కంటిన్యూ అవుతోంది. ఈ సీజన్ లో మరో ఓటమిని చవిచూసింది. ముంబై ఇండియన్స్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్ హెచ్ ని చిత్తు చేసింది ముంబై. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేసింది. 144 పరుగుల టార్గెట్ ను ముంబై మరో 26 బంతులు మిగిలి ఉండగానే ఛేజ్ చేసింది.
Also Read: కోహ్లీకి ఓ రూల్.. మిగిలిన వాళ్లకి ఇంకో రూలా?
ఈ సీజన్ లో ముంబైకి ఇది వరుసగా 4వ విజయం. ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడిన ముంబై 5 మ్యాచుల్లో గెలిచింది, 4 మ్యాచుల్లో ఓడింది. తాజా విజయంతో పాయింట్ల టేబుల్ లో 3 స్థానానికి చేరుకుంది. అటు హైదరాబాద్ కు వరుసగా రెండో పరాజయం. ఈ సీజన్ లో ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడిన ఎస్ఆర్ హెచ్ 6 మ్యాచుల్లో ఓడిపోయింది. పాయింట్ల టేబుల్ లో 9వ స్థానంలో ఉంది హైదరాబాద్.