IPL 2025: ఢిల్లీపై ముంబై ఘన విజయం..
తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

Courtesy BCCI
IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ షోతో ఢిల్లీపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. 18.2 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫలితంగా 59 పరుగుల తేడాతో ముంబై విక్టరీ కొట్టింది.
ఢిల్లీ బ్యాటర్లలో సమీర్ రిజ్వీ ఒక్కడే రాణించాడు. 35 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఇతర బ్యాటర్లు అంతా విఫలం అయ్యారు. ఎంఐ బౌలర్లలో మిచెల్ శాంట్నర్, బుమ్రా తలో మూడు వికెట్లు పడగొట్టారు. బౌల్ట్, దీపక్ చాహర్, విల్ జాక్స్, కర్ణ్ శర్మ చెరో వికెట్ తీశారు. ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఫ్లే ఆఫ్స్ లో తలపడనున్నాయి.