IPL 2025: ముంబై వర్సెస్ గుజరాత్.. GT టార్గెట్ ఎంతంటే…
విల్ జాక్స్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 35 బంతుల్లో 53 పరుగులు చేశాడు.

Courtesy BCCI
IPL 2025: గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. విల్ జాక్స్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 35 బంతుల్లో 53 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 24 బంతుల్లో 35 రన్స్ చేశాడు. కార్బిన్ బాచ్ 22 బంతుల్లో 27 రన్స్ చేశాడు. మిగతా బ్యాటర్లు రాణించలేదు. గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్ 2 వికెట్లు తీశాడు. సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్, గెరాల్డ్ తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్ లో గుజరాత్ బౌలర్లు అదరగొట్టారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ముంబై బ్యాటర్లను కట్టడి చేశారు. జీటీ బౌలర్ల విజృంభణతో ఎంఐ బ్యాటర్లు దూకుడుగా ఆడలేకపోయారు. 97 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఎంఐ.. 113కే 6 వికెట్లు నష్టపోయింది. చివరికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 రన్స్ మాత్రమే చేసింది. చివరలో బాచ్ 22 బంతుల్లో 27 పరుగులు చేయడంతో ముంబై ఆ మాత్రమైన స్కోర్ చేయగలిగింది.