IPL 2025 : ఉత్కంఠ పోరులో పంజాబ్‌దే విజయం.. పోరాడి ఓడిన గుజరాత్ టైటాన్స్..
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది.

Courtesy BCCI
IPL 2025 : ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ లో పంజాబ్ జట్టు గెలుపొందింది. 11 పరుగుల తేడాతో గుజరాత్ ను ఓడించింది. పోరాటం చేసినా గుజరాత్ కు ఓటమి తప్పలేదు.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. 244 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు పోరాడి ఓడింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది.
పంజాబ్ జట్టులో ఓపెనర్ సాయి సుదర్శన్ మెరుపు బ్యాటింగ్ చేశాడు. 41 బంతుల్లోనే 74 పరుగులు బాదాడు. జోస్ బట్లర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 33 బంతుల్లో 54 పరుగులు చేశాడు. రూథర్ ఫోర్డ్ (46), శుబ్ మన్ గిల్ (33) ధనాధన్ బ్యాటింగ్ చేశారు. ఆఖరి ఓవర్ లో 27 పరుగులు కావాల్సి ఉండగా.. వికెట్లు పడ్డాయి. దాంతో గుజరాత్ కు ఓటమి తప్పలేదు.
Also Read : ఢిల్లీ పై ఓటమి.. లక్నో డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లకు సంజీవ్ గొయెంకా క్లాస్.. వీడియో వైరల్
అంతకుముందు పంజాబ్ కెప్టెన్ శ్రేయర్ అయ్యర్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించాడు. 42 బంతుల్లోనే 97 పరుగులు బాదాడు. అయితే, సెంచరీ చేసుకునేందుకు అవకాశం ఉన్నా చేసుకోలేదు. దీంతో ఐపీఎల్ లో తొలి సెంచరీ తృటిలో మిస్ అయ్యింది. అయ్యర్ ఇన్నింగ్స్ లో 9 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి.