IPL 2025: అయ్యో రాజస్థాన్.. జస్ట్ మిస్.. చివరి రెండు ఓవర్లలో ఫలితాన్ని మార్చేసిన ఆర్సీబీ..
చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ఆర్సీబీ విజయం సాధించింది.

Credit BCCI
IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా గురువారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. చివరి రెండు ఓవర్ల వరకు రాజస్థాన్ విజయం ఖాయం అని అందరూ భావించగా.. చివరి రెండు ఓవర్లలో మ్యాచ్ ఫలితాన్ని ఆర్సీబీ పూర్తిగా మార్చేసింది. దీంతో రాజస్థాన్ జట్టుకు నిరాశ తప్పలేదు.
Also Read: IPL 2025: అయ్యో.. ఇషాన్ ఇలా చేశావేంటి..! నీ నిజాయితీ తగలెయ్య.. వరుసగా ఓడిపోతున్నామన్న బాధకూడాలేదా..?
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టులో కోహ్లీ (70), పడిక్కల్ (50) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. భారీ పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. 18వ ఓవర్ భువనేశ్వర్ వేయగా.. జురెల్ ఒక సిక్స్, రెండు ఫోర్లు, శుభమ్ దూబె ఒక సిక్స్ బాదారు. దీంతో ఆ ఓవర్లో 22 పరుగులు రాబట్టారు. అప్పటికి రాజస్థాన్ స్కోర్ ఐదు వికెట్లు కోల్పోయి 188 పరుగులకు చేరింది. దీంతో ఆర్ఆర్ జట్టు గెలవాలంటే రెండు ఓవర్లలో 18 పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలో రాజస్థాన్ జట్టుదే పైచేయిగా కనిపించింది. కానీ, గెలుపు ముంగిట ఆర్ఆర్ జట్టు బోల్తాకొట్టింది.
19వ ఓవర్ బౌలింగ్ చేసిన హేజిల్ వుడ్ రాజస్థాన్ రాయల్స్ విజయాన్ని బెంగళూరు వైపు లాగేసుకున్నాడు. ఆ ఓవర్లో జోరుమీదున్న జురెల్ తోపాటు అర్చర్ ను ఔట్ చేయడంతో పాటుగా ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి రాజస్థాన్ రాయల్స్ గెలుపు ఆశలపై హేజిల్ వుడ్ నీళ్లు చల్లాడు. చివరి ఓవర్ ను యశ్ దయాళ్ సైతం కట్టుదిట్టంగా వేయడంతో ఆర్ఆర్ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 194పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, ఆర్ఆర్ జట్టు 189 పరుగుల వద్దే మూడు వికెట్లు కోల్పోవటం గమనార్హం.
ఆర్సీబీ ఆరో విజయంతో ప్లేఆఫ్స్ కు చేరువైంది. వరుసగా అయిదో ఓటమితో, మొత్తంగా ఏడో ఓటమి చవిచూసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు.. ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్ర్కమించినట్లయింది. ఓడిపోతామనుకున్న మ్యాచ్ లో విజయం సాధించడంతో ఆర్సీబీ ప్లేయర్స్ సంబరాలు అంబరాన్నంటాయి. విజయం తరువాత విరాట్ కోహ్లీ ఆర్సీబీ బౌలర్ హేజిల్ వుడ్ వద్దకు వెళ్లి అతన్ని ఎత్తుకొని ప్రత్యేకంగా అభినందించారు.
FRAME OF THE DAY…!!!!
– Kohli lifting the hero after the victory ⚡ pic.twitter.com/S9yDUA9ZCp
— Johns. (@CricCrazyJohns) April 24, 2025