IPL 2025: వావ్..అదిరిపోయే క్యాచ్.. ముంబై బ్యాట‌ర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఎస్ఆర్‌హెచ్‌ బౌలర్.. కావ్య పాప ఫుల్ హ్యాపీ.. వీడియో వైరల్

ఎస్ఆర్ హెచ్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

IPL 2025: వావ్..అదిరిపోయే క్యాచ్.. ముంబై బ్యాట‌ర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఎస్ఆర్‌హెచ్‌ బౌలర్.. కావ్య పాప ఫుల్ హ్యాపీ.. వీడియో వైరల్

Jaydev Unadkat (Image Credit BCCI)

Updated On : April 24, 2025 / 7:41 AM IST

IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా బుధవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.

Also Read: IPL 2025: అయ్యో.. ఇషాన్ ఇలా చేశావేంటి..! నీ నిజాయితీ తగలెయ్య.. వరుసగా ఓడిపోతున్నామన్న బాధకూడాలేదా..?

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేసింది. క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) పరుగులు చేశారు. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ జట్టు 15.4 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసి విజేతగా నిలిచింది. రోహిత్ శర్మ (70), సూర్యకుమార్ యాదవ్ (40 నాటౌట్) ముంబై జట్టు విజయంలో కీలక భూమిక పోషించారు. అయితే, ఈ మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు.

Also Read: Kl Rahul : చ‌రిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్‌.. డేవిడ్ వార్న‌ర్‌, విరాట్ కోహ్లీల రికార్డులు బ్రేక్‌..

ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ అదిరిపోయే క్యాచ్ అందుకున్నాడు. రెండో ఓవర్ వేసిన ఉద్కత్ నాలుగో బంతికి రికెల్టన్ (11)ను కాటన్ బౌల్డ్ చేశాడు. రికెల్టన్ స్టైట్ గా భారీ షాట్ కొట్టగా.. జయదేవ్ ఆ బంతిని ఒంటి చేత్తో అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో రికెల్టన్ ఆశ్చర్యంగా జయదేవ్ వైపు చూస్తూ పెవిలియన్ బాటపట్టాడు. జయదేవ్ సూపర్ క్యాచ్ అందుకోవటంతో ఎస్ఆర్ హెచ్ జట్టు ఓనర్ కావ్య పాప ఫుల్ హ్యాపీగా కనిపించారు. చప్పట్లు కొడుతూ తన సంతోషాన్ని వెలుబుచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు జయదేవ్ ఒంటి చేత్తో క్యాచ్ పట్టిన తీరును చూసి అభినందిస్తున్నారు.