Kl Rahul : చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీల రికార్డులు బ్రేక్..
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు.

Courtesy BCCI
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 5వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఈ క్రమంలో అతడు డేవిడ్ వార్నర్ రికార్డును బ్రేక్ చేశాడు. డేవిడ్ వార్నర్ 135 ఇన్నింగ్స్‌ల్లో 5వేల పరుగుల మైలురాయిని చేరుకోగా కేఎల్ రాహుల్ 130 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఇక ఈ జాబితాలో పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. 157 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ 5వేల ఐపీఎల్ పరుగులను పూర్తి చేశాడు.
IPL 2025 : రాజస్థాన్ రాయల్స్ పై ఫిక్సింగ్ ఆరోపణలు!
IPL POSTER FOR KL RAHUL, The main man 🔥 pic.twitter.com/BiI6w5SU7d
— Johns. (@CricCrazyJohns) April 22, 2025
ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 5 వేల పరుగులు చేసిన ఆటగాళ్లు..
కేఎల్ రాహుల్ – 130 ఇన్నింగ్స్‌లు
డేవిడ్ వార్నర్ – 135 ఇన్నింగ్స్‌లు
విరాట్ కోహ్లీ – 157 ఇన్నింగ్స్‌లు
ఏబీ డివిలియర్స్ – 161 ఇన్నింగ్స్‌లు
శిఖర్ ధావన్ – 168 ఇన్నింగ్స్‌లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో ఐడెన్ మార్‌క్రమ్ (52; 33 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా, మిచెల్ మార్ష్ (45; 36 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), ఆయుష్ బదోని (36; 21 బంతుల్లో 6 ఫోర్లు) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ నాలుగు వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్, చమీర చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అభిషేక్ పోరల్ (51; 36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), కేఎల్ రాహుల్ (57 నాటౌట్; 42 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో కదం తొక్కగా, అక్షర్ పటేల్ (34 నాటౌట్; 20 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. లక్నో బౌలర్లలో మార్‌క్రమ్ రెండు వికెట్లు పడగొట్టాడు.