IPL 2025 resumes : ఐపీఎల్ 2025 పునఃప్రారంభం.. మిగిలిన మ్యాచ్‌ల తేదీలు, స‌మయం, స్ట్రీమింగ్ వివ‌రాలు ఇవే..

భార‌త్, పాక్ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో వాయిదా ప‌డిన ఐపీఎల్ 2025 నేటి (మే17) నుంచి పునఃప్రారంభం కానుంది.

IPL 2025 resumes : ఐపీఎల్ 2025 పునఃప్రారంభం.. మిగిలిన మ్యాచ్‌ల తేదీలు, స‌మయం, స్ట్రీమింగ్ వివ‌రాలు ఇవే..

IPL 2025 resumes remaining matches Date Time Broadcast and Live Streaming details here

Updated On : May 17, 2025 / 11:45 AM IST

భార‌త్, పాక్ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో వాయిదా ప‌డిన ఐపీఎల్ 2025 నేటి (మే17) నుంచి పునఃప్రారంభం కానుంది. శ‌నివారం బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో రాయ‌ల్స్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ల‌ప‌డ‌నుంది. ఇక ఇప్ప‌టికే స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్ర్క‌మించిన సంగ‌తి తెలిసిందే. ఏడు జ‌ట్లు నాలుగు బెర్తుల కోసం పోటీప‌డుతున్నాయి. జూన్ 3న ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

కాగా.. స‌వ‌రించిన షెడ్యూల్‌, మ్యాచ్‌ల ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం వంటి వివ‌రాలు ఇప్పుడు చూద్దాం..

RCB vs KKR : ఓడితే కోల్‌క‌తా ఇంటికే.. గెలిస్తే ఆర్‌సీబీకి పండగే.. చిన్న‌స్వామి వేదిక‌గా కీల‌క మ్యాచ్‌..

ఐపీఎల్ 2025 రీషెడ్యూల్ ఇదే..

మే 17 – ఆర్‌సీబీ వ‌ర్సెస్‌ కేకేఆర్ – బెంగళూరు (రాత్రి 7:30 గంటలకు)
మే 18 – రాజస్థాన్ రాయల్స్ వ‌ర్సెస్‌ పంజాబ్ కింగ్స్ – జైపూర్ (మధ్యాహ్నం 3:30 గంటలకు)
మే 18 – ఢిల్లీ క్యాపిటల్స్ వ‌ర్సెస్‌ గుజరాత్ టైటాన్స్ – ఢిల్లీ (రాత్రి 7:30 గంటలకు)
మే 19 – లక్నో సూపర్ జెయింట్స్ వ‌ర్సెస్‌ సన్‌రైజర్స్ హైదరాబాద్ – లక్నో (రాత్రి 7:30 గంటలకు)
మే 20 – చెన్నై సూపర్ కింగ్స్ వ‌ర్సెస్‌ రాజస్థాన్ రాయల్స్ – ఢిల్లీ (రాత్రి 7:30 గంటలకు)
మే 21 – ముంబై ఇండియన్స్ వ‌ర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్ – ముంబై (రాత్రి 7:30 గంటలకు)
మే 22 – గుజరాత్ టైటాన్స్ వ‌ర్సెస్‌ లక్నో సూపర్ జెయింట్స్ – అహ్మదాబాద్ (రాత్రి 7:30 గంటలకు)
మే 23 – ఆర్‌సీబీ వ‌ర్సెస్‌ సన్‌రైజర్స్ హైదరాబాద్ – బెంగళూరు (రాత్రి 7:30 గంటలకు)

Sunil Gavaskar : హార్దిక్ పాండ్యా పై సునీల్ గ‌వాస్క‌ర్ షాకింగ్ కామెంట్స్‌.. అతడు అలా చేయ‌డం లేదు.. అందుకే ముంబై ఇలా..

మే 24 – పంజాబ్ కింగ్స్ వ‌ర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్ – జైపూర్ (రాత్రి 7:30 గంటలకు)
మే 25 – గుజరాత్ టైటాన్స్ వ‌ర్సెస్‌ చెన్నై సూపర్ కింగ్స్ – అహ్మదాబాద్ (మధ్యాహ్నం 3:30 గంటలకు)
మే 25 – సన్‌రైజర్స్ హైదరాబాద్ వ‌ర్సెస్‌ కేకేఆర్ – ఢిల్లీ (రాత్రి 7:30 గంటలకు)
మే 26 – పంజాబ్ కింగ్స్ వ‌ర్సెస్‌ ముంబై ఇండియన్స్ – జైపూర్ (రాత్రి 7:30 గంటలకు)
మే 27 – లక్నో సూపర్ జెయింట్స్ వ‌ర్సెస్‌ ఆర్‌సీబీ – లక్నో (రాత్రి 7:30 గంటలకు)
మే 29 – క్వాలిఫయర్ 1 (వేదిక ఇంకా నిర్ణయించలేదు, రాత్రి 7:30 గంటలకు)
మే 30 – ఎలిమినేటర్ (వేదిక ఇంకా నిర్ణయించలేదు, రాత్రి 7:30 గంటలకు)
జూన్ 1 – క్వాలిఫయర్ 2 (వేదిక ఇంకా నిర్ణయించలేదు, రాత్రి 7:30 గంటలకు)
జూన్ 3 – ఫైనల్ (వేదిక ఇంకా నిర్ణయించలేదు, రాత్రి 7:30 గంటలకు)

ఏ ఛానల్స్‌లో మ్యాచ్‌ల‌ను చూడొచ్చంటే..

భారతదేశం – సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, జియోహాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్
ఆఫ్ఘనిస్తాన్ – ATN
ఆస్ట్రేలియా – ఫాక్స్ స్పోర్ట్స్, కాయో స్పోర్ట్స్ మరియు ఫాక్స్‌టెల్ గో
బంగ్లాదేశ్ – టి స్పోర్ట్స్, టోఫీ యాప్
న్యూజిలాండ్ – స్కై స్పోర్ట్ NZ
దక్షిణాఫ్రికా – సూపర్‌స్పోర్ట్
శ్రీలంక – స్టార్ స్పోర్ట్స్
UK – స్కై స్పోర్ట్స్, స్కై గో
USA, కెనడా – విల్లో టీవీ

Rohit Sharma : క‌ల‌లో కూడా అనుకోలేద‌న్న రోహిత్ శ‌ర్మ‌.. రితికా సజ్దే భావోద్వేగం..