IPL 2025: పంజాబ్ జట్టుపై ఓటమి తరువాత రిషబ్ పంత్ కీలక కామెంట్స్.. ‘కల ఇంకా సజీవంగా ఉంది’
పంజాబ్ కింగ్స్ జట్టుపై ఓటమి అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కీలక కామెంట్స్ చేశాడు.

Rishabh Pant
IPL 2025: ఐపీఎల్ -2025 టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి పంజాబ్ కింగ్స్ (PBKS) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు 37 పరుగుల తేడాతో లక్నో జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేయగా.. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 199 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది.
పంజాబ్ కింగ్స్ జట్టులో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (48 బంతుల్లో 91 పరుగులు), జోష్ ఇంగ్లిష్ (14 బంతుల్లో 30), శ్రేయాస్ అయ్యర్ (25 బంతుల్లో 45), శశాంక్ సింగ్ (15 బంతుల్లో33) రాణించడంతో ఆ జట్టు భారీ స్కోర్ చేయగలిగింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బతగిలింది. మిచెల్ మార్ష్ డకౌట్ అయ్యాడు. నికోలస్ పూరన్ (6) వెంటనే ఔట్ అయ్యాడు. రిషబ్ పంత్ (18) తక్కువ స్కోర్ కే పెవిలియన్ బాటపట్టాడు. ఈ సమయంలో ఆయుష్ బడోని (40 బంతుల్లో 74), అబ్దుల్ సమద్ (24 బంతుల్లో 45) రాణించారు. దీంతో నిర్ణీత ఓవర్లలో లక్నో స్కోర్ 199 పరుగులకు చేరింది.
Also Read: PBKS vs LSG: రిషబ్ పంత్ ఈసారి బాల్, బ్యాట్ రెండూ గాల్లోకి లేపాడు.. సంజీవ్ గోయెంకా రియాక్షన్ వైరల్
మ్యాచ్ అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ.. ‘‘మేం ఎక్కువ పరుగులిచ్చాం. కీలకమైన క్యాచ్ లను వదిలేయడం మమ్మల్ని దెబ్బతీసింది. ఆరంభంలో మా బౌలర్లు సరైన లెంగ్త్ లో బౌలింగ్ చేయలేదు. కానీ, ఆటలో ఇవన్నీ సహజమే. మా ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. తదుపరి మూడు మ్యాచ్ లు గెలిస్తే మాకు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. మేం కచ్చితంగా ఈ మూడు మ్యాచ్ లలో విజయం సాధించే ప్రయత్నం చేస్తాం.’’ అని పంత్ పేర్కొన్నాడు.
LSG in first 6 games: 4 wins & 2 loss.
LSG in last 5 games: 1 win & 4 loss. pic.twitter.com/uEHhizXPTZ
— Johns. (@CricCrazyJohns) May 4, 2025