IPL 2025: పంజాబ్ కింగ్స్ ఎవరి వల్ల ఓడిపోయింది..? కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఏం చెప్పాడంటే..
రాజస్థాన్ జట్టుపై ఓటమి తరువాత పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ ఓటమికి గల కారణాలను వెల్లడించారు.

Shreyas Iyer (Courtesy BCCI)
IPL 2025: ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా మొహాలీ వేదికగా శనివారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పంజాబ్ పై రాజస్థాన్ ఘనవిజయం సాధించింది. 50 పరుగుల తేడాతో పంజాబ్ జట్టును ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. 206 రన్స్ భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్.. 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులకే పరిమితమైంది.
ఈ ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ జట్టుకు ఇదే తొలి ఓటమి. గత రెండు మ్యాచుల్లో గెలుపొందిన పంజాబ్.. మూడో మ్యాచ్ లో పరాజయం పాలైంది. తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై, రెండో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై గెలుపొందిన పంజాబ్ కింగ్.. మూడో మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో పరాజయం పాలైంది. అయితే, రాజస్థాన్ జట్టుపై ఓటమి తరువాత పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ ఓటమికి గల కారణాలను వెల్లడించారు.
Also Read: IPL 2025 : రాజస్థాన్ ఘన విజయం.. ఈ సీజన్‌లో పంజాబ్ తొలి ఓటమి
రాజస్థాన్ రాయల్స్ జట్టు 180-185 పరుగులు చేస్తుందని అనుకున్నాం. కానీ, మేము వేసుకున్న ప్రణాళిక తప్పింది. ఫలితంగా రాజస్థాన్ స్కోర్ 200 మార్క్ దాటింది. ఇది బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్. అయితే, మేము బౌలింగ్ లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయాం. బ్యాటింగ్ లోనూ తడబాటుకు గురయ్యాం. ప్రారంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోవటం వల్ల భారీ స్కోర్ ను చేరుకోలేక పోయామని శ్రేయాస్ అన్నారు. ఇది మాకే మూడో మ్యాచ్ నే. ఈ మ్యాచ్‌లో ఓడినందుకు సంతోషంగా ఉందని శ్రేయాస్ చెప్పాడు. టోర్నీ ఆరంభంలోనే ఎదురైన ఈ ఓటమితో తమ తప్పిదాలు ఏంటో తెలుస్తాయని అభిప్రాయపడ్డాడు.
పంజాబ్ కింగ్స్ బ్యాటర్ నేహాల్ వధేరాపై శ్రేయాస్ ప్రశంసలు కురిపించాడు. ఈ మ్యాచ్ లో నెహాల్ 41 బంతుల్లో 62 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో మూడు సిక్సులు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. శ్రేయాస్ నెహాల్ గురించి మాట్లాడుతూ.. ‘‘అతను ఒత్తిడిలోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ప్రారంభంలో క్రీజులో నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్నప్పటికీ బౌలర్ల బలహీనతలను విశ్లేషించుకొని పరుగులు రాబట్టగలిగాడని ప్రశంసించాడు. తాజాగా ఓటమికి గల కారణాలను విశ్లేషించుకొని వచ్చే మ్యాచ్ లో విజయం సాధించే దిశగా బలపడతామని శ్రేయాస్ చెప్పాడు. ఇదిలాఉంటే ఈ మ్యాచ్ లో శ్రేయాస్ (10) తక్కువ స్కోర్ కే పెవిలియన్ బాటపట్టాడు. రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి ఓవర్లో తొలి బంతికే ప్రియాంశ్ ఆర్య డకౌట్ అయ్యాడు. అదే ఓవర్లో చివరి బంతికి శ్రేయాస్ ఔట్ అయ్యాడు.
Archer on 🎯
Jofra Archer’s double timber-strike gives #RR a dream start 💥
Updates ▶ https://t.co/kjdEJydDWe#TATAIPL | #PBKSvRR | @JofraArcher | @rajasthanroyals pic.twitter.com/CfLjvlCC6L
— IndianPremierLeague (@IPL) April 5, 2025