IPL 2026 MI vs SRH : ముంబై ఓటమిపై హార్థిక్ పాండ్యా సంచలన కామెంట్స్.. మా ఓటమికి ఈ రెండు తప్పిదాలే కారణం.. జట్టుకు నష్టం జరుగుతుంది..
IPL 2026 MI vs SRH : ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ జట్టు విజయం సాధించింది.
Hardik Pandya
- ముంబై జట్టుపై ఎస్ఆర్హెచ్ విజయం
- ఓటమిపై కీలక కామెంట్స్ చేసిన హార్దిక్ పాండ్యా
- ఈ రెండు కారణాల వల్లనే ఓడిపోయామంటూ వెల్లడి
IPL 2026 MI vs SRH : ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు. ఓటమికి గల కారణాలను వెల్లడించారు.
Also Read : IPL 2026: తిరుగులేని హైదరాబాద్.. వరుసగా 5వ గెలుపు.. ముంబైపై సంచలన విజయం..
హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. మంచు పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ, మేము కొన్ని చెడ్డ బంతులు వేశాం. అందుకే వారికి మంచి ఆరంభం లభించింది. ఆ తరువాత మేము పుంజుకున్నా అది సరిపోలేదు. బ్యాటింగ్ లో మేము అద్భుతంగా రాణించాం. కానీ, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో విఫలమయ్యాం. ఆ రెండు ప్రధాన కారణాల వల్ల మేము ఓడిపోవాల్సి వచ్చిందని పాండ్యా చెప్పుకొచ్చాడు.
NO LOOK SIX BY SALIL ARORA vs BUMRAH 🥶
– One of the best shots in IPL 2026. pic.twitter.com/x9dOpL9EUS
— Johns. (@CricCrazyJohns) April 29, 2026
ఈ మ్యాచ్‌లో నేను చాలా ఎంజాయ్ చేశాను. 244 పరుగులు మంచి స్కోర్. అయితే, మా బౌలర్లు ఆ స్కోర్ ను డిఫెండ్ చేస్తారని నమ్మాను. కానీ, మా బౌలింగ్ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం. మా ఫీల్డింగ్ లో అవకాశాలు చేజారాయి. ఈ సీజన్లో మేము చాలా క్యాచ్‌లు వదిలేస్తున్నాం. క్యాచ్‌లను పట్టుకున్నప్పుడే అదృష్టం. మూమెంటమ్ మారుతుంది. క్యాచ్ లు వదిలేస్తే జట్టుకు నష్టం జరుగుతుంది. ఈ పరిణామం జట్టు ఓటమికి ప్రధాన కారణంగా మారుతుంది. అయితే, ఈ మ్యాచ్ లో కుర్రాళ్లంతా విజయం కోసం బాగా ప్రయత్నించారు. తమ సర్వస్వాన్ని ఒడ్డారు. కానీ, ఈరోజు మాకు కలిసి రాలేదంటూ హార్డిక్ పేర్కొన్నారు.
ముఖ్యంగా మా బౌలింగ్ ప్రణాళికలు అనుకున్న స్థాయిలో అమలు చేయలేక పోయాం. మా బౌలింగ్ సమస్యలను పరిష్కరించేందుకు మాకు ఆప్షన్స్ కూడా ఎక్కువగా లేవు. ఎలాంటి మార్పులు చేయగలమో పరిశీలిస్తాం. అయితే, నా బౌలర్లను నేను తప్పుబట్టను. ఒక జట్టుగా ముంబై ఇండియన్స్ కు ఏదైతే గుర్తింపు పొందిందో.. దానికి తగ్గట్టుగా మేము రాణించలేక పోయాం.
మేము ఫోకస్ చేయాల్సిన విషయాలను సరిచూసుకోవాలి. అయినా పర్వాలేదు. మాకు అంకితభావం కలిగిన ఓనర్స్, గొప్ప సపోర్ట్ స్టాఫ్ ఉన్నారు. మేము మా సమస్యలను కచ్చితంగా పరిష్కరించుకొని మున్ముందు అద్భుత ప్రతిభను కనబరుస్తాము అంటూ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. ప్రేక్షకుల నుంచి మాకు అద్భుతమైన మద్దతు లభిస్తోంది. కానీ, మాకు మద్దతు ఇచ్చేంత గొప్ప ప్రదర్శనను మేం వారికి అందించలేకపోయామని హార్డిక్ అన్నారు.
Hardik Pandya said, “as an overall unit, we have not been able to do what exactly MI stand for. We really need to see what all we need to work on. We have passionate owners, we have passionate support staff. We always figure out something “. pic.twitter.com/1FS7W43IqV
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 29, 2026
