Pat Cummins : SRH కి బిగ్ షాక్.. IPL 2026 నుంచి పాట్ కమిన్స్ ఔట్?
Pat Cummins : SRH జట్టుతో పాటు అభిమానులకు ఇది షాకింగ్ వార్తే అని చెప్పాలి. పాట్ కమ్మిన్స్ ఆస్ట్రేలియా వెళ్లాడు. కారణం...
IPL 2026 Pat Cummins Flies Back To Australia For Final Back Scan
- SRH కి ఊహించని దెబ్బ
- ఆస్ట్రేలియా వెళ్లిన పాట్ కమ్మిన్స్
- వెన్ను గాయం చికిత్స కోసం ఆస్ట్రేలియాకు
Pat Cummins : తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓటమి పాలైనా.. ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ పై విజయం.. అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించేలా చేసినా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్ తగిలింది. SRH కెప్టెన్ పాట్ కమ్మిన్స్ (Pat Cummins) తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. మొన్నటి వరకు ఇండియాలోనే ఉన్న కమ్మిన్స్, వెన్ను గాయానికి తుది వైద్య పరీక్షల కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. ఐపీఎల్లో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కమ్మిన్స్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వెన్ను నొప్పితో బాధపడుతున్న పాట్ కమ్మిన్స్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అందుకే ఆయన ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో.. తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
అయితే వచ్చే వారం నుంచి ఎస్ఆర్హెచ్ ఆడబోయే మ్యాచులకు కమ్మిన్స్ అందుబాటులో ఉంటాడని అభిమానులు ఊహిస్తూ వస్తున్నారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. పాట్ కమ్మిన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న ఆయన.. తాజాగా హైదరాబాద్ నుంచి తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. కమ్మిన్స్ వెన్ను నొప్పికి సంబంధించి ఆస్ట్రేలియా ఆస్పత్రిలో ఫైనల్ మెడికల్ స్కానింగ్ ఉన్న నేపథ్యంలో ఆయన తిరిగి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
ఈ అంశంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మరియు ఎస్ఆర్హెచ్ యజమానురాలు కావ్య మారన్ అనుమతితోనే కమ్మిన్స్ ఆస్ట్రేలియాకు తిరుగు ప్రయాణం అయ్యాడు. ఫైనల్ స్కానింగ్ కోసం ఆస్ట్రేలియా వెళ్తున్న కమ్మిన్స్.. ఈ నెల 17వ తేదీన మళ్లీ ఇండియాకు వస్తాడని అంటున్నారు. ఒకవేళ అప్పుడు రావడం కుదరకపోతే.. ఇక మేలోనే పాట్ కమ్మిన్స్ వచ్చేందుకు అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికే సరైన బౌలింగ్ లైనప్ లేని తరుణంలో పాట్ కమ్మిన్స్ ఇలా ఆస్ట్రేలియాకు వెళ్లడం సన్‌రైజర్స్ అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. అతడు త్వరగా కోలుకుని.. తిరిగి జట్టులోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.
RCB vs SRH : సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన భువనేశ్వర్ కుమార్
కమ్మిన్స్ తిరిగి జట్టులో చేరితే SRHకి ఇది పెద్ద బలం అవుతుంది. ప్రస్తుతం జట్టు విదేశీ పేసర్లుగా లసిత్ మాలింగ, డేవిడ్ పేన్లపై ఆధారపడుతోంది. గత ఏడాది జూలైలో గాయపడిన తర్వాత కమ్మిన్స్ ఆడిన ఏకైక పోటీ మ్యాచ్ మూడో యాషెస్ టెస్ట్ మాత్రమే. మొదట T20 వరల్డ్ కప్‌కు తిరిగి రావాలని భావించినప్పటికీ, రికవరీలో చిన్న సమస్యల కారణంగా ఆలస్యం జరిగింది.
