IPL 2026: ఉత్కంఠ పోరులో చెన్నైని చిత్తు చేసిన హైదరాబాద్
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (59), క్లాసెన్ (59) హాఫ్ సెంచరీలతో మెరిశారు.
IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. 10 పరుగుల తేడాతో చెన్నైని చిత్తు చేసింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో విజయం హైదరాబాద్ నే వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (59), క్లాసెన్ (59) హాఫ్ సెంచరీలతో మెరిశారు.
195 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన సీఎస్ కే 8 వికెట్ల నష్టానికి 184 పరుగులే చేసింది. హైదరాబాద్ బౌలర్లు మరోసారి సత్తా చాటారు. ప్రత్యర్థిని కట్టడి చేయగలిగారు. మలింగ్ మూడు వికెట్లతో మెరిశాడు. నితీశ్ రెండు వికెట్లు తీశాడు. ఈ సీజన్ లో హైదరాబాద్ కు ఇది బ్యాక్ టు బ్యాక్ విక్టరీ.
