ఐపీఎల్ ఫైనల్ హైదరాబాద్‌లో.. మే12న

ముందుగా చెన్నైలోని స్టేడియంలో నిర్వహించాలని అనుకున్న బీసీసీఐకి తమిళనాడు నుంచి చేదు

ఐపీఎల్ ఫైనల్ హైదరాబాద్‌లో.. మే12న

Updated On : April 22, 2019 / 12:32 PM IST

ముందుగా చెన్నైలోని స్టేడియంలో నిర్వహించాలని అనుకున్న బీసీసీఐకి తమిళనాడు నుంచి చేదు

ఐపీఎల్ ఫైనల్ డేట్ నిర్దారించడంతో పాటు వేదిక కూడా దాదాపు ఖాయం అయిపోయింది. మే 12న ఫైనల్ జరగనుందని తెలియజేయడంతో పాటు ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగానే ఆ మ్యాచ్ జరగనున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం.. చెన్నైలోని స్టేడియంలో నిర్వహించాలని అనుకున్న బీసీసీఐకి తమిళనాడు నుంచి చేదు అనుభవం ఎదురైంది. 
Also Read : ధోనీని ప్రధాన మంత్రిని చేయాలి

తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఐ, జే, కే ఓపెన్ స్టాండ్స్‌కు అనుమతి ఇవ్వలేదు. అయితే చెన్నై స్టేడియంలో క్వాలిఫైయర్ 1, వైజాగ్‌లో క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఐపీఎల్ సంప్రదాయం ప్రకారం.. విన్నర్, రన్నర్ జట్లకు సంబంధించిన వేదికలపైనే క్వాలిఫైయర్ 1,2 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. 

బీసీసీఐ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌తో చర్చలు జరిపాం. గత సీజన్ విజేత చెన్నై సూపర్ కింగ్స్ సొంతగడ్డపై ఫైనల్ ఆడాలని ప్రయత్నించాం. కానీ, అనుమతి రాలేదు. 3 ఖాళీ స్టాండ్‌లు ప్రశ్నార్థకంగా మారాయి. ముందుగా అనుకున్నట్లు బెంగళూరు, హైదరాబాద్ వేదికలు 2ప్లే ఆఫ్‌లకు, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌ల కోసం పరిశీలిస్తున్నాం. 
Also Read : కోట్ల మందికి ఇదే దిక్కు : 123456.. మీ పాస్‌వ‌ర్డ్‌ మాకు తెలుసు