ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది: మార్చి 23న తొలి మ్యాచ్

ఇప్పటికే విడుదల చేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) షెడ్యూల్‍ను ఎన్నికల కారణంగా మారుతుందేమోననే అనుకున్నారంతా.. వారి అపోహలన్నింటికీ సమాధానంగా ఐపీఎల్ షెడ్యూల్ ఏ మాత్రం మార్పుల్లేకుండా అదే తేదీల్లో జరుగుతుందని ఐపీఎల్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. అయితే ఐపీఎల్ 12 సీజన్ పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించకుండా కేవలం 17 మ్యాచ్‌లకు మాత్రమే షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
మార్చి 23నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్.. తొలి మ్యాచ్‌ను చెన్నై వేదికగా ఆరంభించనుంది. ఓపెనింగ్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ చెన్నై వేదికగా తలపడనుంది. ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌ను ఆదివారం మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. ఒక రోజు తర్వాత మార్చి 25న కోల్‌కతా నైట్ రైడర్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌లు తొలి మ్యాచ్‌ను ఆడనున్నాయి.
ముందుగా చెప్పినట్లుగానే 2019 సాధారణ ఎన్నికల ఆధారంగానే షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పిన ఐపీఎల్ యాజమాన్యం ముందు జాగ్రత్తగా రెండు వారాల షెడ్యూల్ మాత్రమే విడుదల చేసింది.
రెండు వారాలపాటు జరగనున్న ఐపీఎల్ షెడ్యూల్ వివరాలిలా ఉన్నాయి.
శనివారం, మార్చి 23, చెన్నైలో
సాయంత్రం: చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్ప్ బెంగళూరు,
ఆదివారం, మార్చి 24, కోల్‌కతాలో
మధ్యాహ్నం: Kolkata Knight Riders vs Sunrisers Hyderabad in Kolkata
సాయంత్రం: Mumbai Indians vs Delhi Capitals in Mumbai
సోమవారం, మార్చి 25, జైపూర్ లో
సాయంత్రం: Rajasthan Royals vs Kings XI Punjab
మంగళవారం, మార్చి 26, ఢిల్లీలో
Delhi Capitals vs చెన్నై సూపర్ కింగ్స్
బుధవారం, మార్చి 27, కోల్‌కతాలో
సాయంత్రం: Kolkata Knight Riders vs Kings XI Punjab
గురువారం, మార్చి 28, బెంగళూరులో
సాయంత్రం: Royal Challengers Bangalore vs Mumbai Indians
శుక్రవారం, మార్చి 29, హైదరాబాద్‌లో
సాయంత్రం: Sunrisers Hyderabad vs Rajasthan Royals
శనివారం, మార్చి 30న
మధ్యాహ్నం: , మొహాలిలో Kings XI Punjab vs Mumbai Indians
సాయంత్రం: ఢిల్లీలో Delhi Capitals vs Kolkata Knight Riders
ఆదివారం, మార్చి 31
మధ్యాహ్నం: హైదరాబాద్‌లో Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore in Hyderabad
సాయంత్రం: చెన్నైలో Chennai Super Kings vs Rajasthan Royals
సోమవారం, ఏప్రిల్ 1, మొహాలీలో
సాయంత్రం: Kings XI Punjab vs Delhi Capitals
మంగళవారం, ఏప్రిల్ 2, జైపూర్‌లో
సాయంత్రం: Rajasthan Royals vs Royal Challengers Bangalore
బుధవారం, ఏప్రిల్ 3, ముంబైలో
సాయంత్రం: Mumbai Indians vs Chennai Super Kings
గురువారం, ఏప్రిల్ 4, ఢిల్లీలో
సాయంత్రం: Delhi Capitals vs Sunrisers Hyderabad
శుక్రవారం, ఏప్రిల్ 5, బెంగళూరులో
సాయంత్రం: Royal Challengers Bangalore vs Kolkata Knight Riders