IPL2022 DC Vs RR : మార్ష్, వార్నర్ విధ్వంసం.. రాజస్తాన్‌పై ఢిల్లీ ఘన విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. రాజస్తాన్ పై ఘన విజయం సాధించింది. రాజస్తాన్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించింది.

IPL2022 DC Vs RR : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. రాజస్తాన్ పై ఘన విజయం సాధించింది. రాజస్తాన్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. 18.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన 161 పరుగులు చేసింది.

IPL 2022: సీఎస్కే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇక ఇంటికే..

ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. మార్ష్ 62 బంతుల్లో 89 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 7 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. ఓపెనర్ డేవిడ్ వార్నర్ సైతం హాఫ్ సెంచరీతో మెరిశాడు. వార్నర్ 41 బంతుల్లో 52 పరుగులు(నాటౌట్) చేశాడు. అతడి స్కోర్ లో 1 సిక్స్, 5 ఫోర్లు ఉన్నాయి.

IPL 2022: చెన్నై ప్లే ఆఫ్‌కు వెళ్లాలంటే.., ఇవి మాత్రం పక్కా

ఢిల్లీ మిగతా బ్యాటర్లలో ఓపెనర్ శ్రీకర్‌ భరత్ (0) డకౌట్‌ కాగా.. కెప్టెన్ రిషబ్ పంత్ (4 బంతుల్లో 13 పరుగులు..2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, యజువేంద్ర చాహల్ తలో వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.

IPL2022 DC Vs RR Delhi Capitlas Won On Rajasthan Royals By 8 Wickets

ప్లేఆఫ్స్‌ ముందట భారీ తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది ఢిల్లీ. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ స్థానం మారనప్పటికీ ప్లేఆఫ్స్‌ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.

టీ20 లీగ్‌లో చాలా వరకు మ్యాచులు ముగిశాయి. దీంతో టాప్‌-4లో నిలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేందుకు జట్లు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్.. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్‌ 7 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. రిషబ్ పంత్ కెప్టెన్‌గా ఉన్న ఢిల్లీ జట్టు 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి ఐదో స్థానంలో ఉంది.

AB De Villiers: డివిలియర్స్ రిటర్న్స్.. క్లూ ఇచ్చిన కోహ్లీ

రాజస్తాన్ రాయల్స్ జట్టు : యశస్వీ జైస్వాల్‌, జోస్‌ బట్లర్‌, సంజూ శాంసన్‌ (కెప్టెన్‌), దేవదత్ పడిక్కల్, డస్సెన్‌, రియాన్‌ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, చాహల్‌, కుల్‌దీప్‌ సేన్‌.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు : డేవిడ్ వార్నర్‌, శ్రీకర్‌ భరత్‌, మిచెల్ మార్ష్‌, రిషబ్ పంత్ (కెప్టెన్‌), లలిత్‌ యాదవ్‌, రోమన్‌ పావెల్, అక్షర్‌ పటేల్, శార్దూల్ ఠాకూర్‌, చేతన్‌ సకారియా, కుల్‌దీప్‌ యాదవ్‌, ఆన్రిచ్‌ నోర్జే‌.

 

ట్రెండింగ్ వార్తలు