IPL2022 PBKS Vs RR : చివర్లో చెలరేగిన పంజాబ్.. రాజస్తాన్ ముందు బిగ్ టార్గెట్

పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్ జానీ బెయిర్ స్టో హాఫ్ సెంచరీతో మెరిశాడు. 40 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఆఖరి పది ఓవర్లలో పంజాబ్ బ్యాటర్లు పరుగుల వరద పారించారు.

IPL2022 PBKS Vs RR : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా శనివారం పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. రాజస్తాన్ కి 190 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

Sourav Ganguly: గంగూలీ ఇంటికి అమిత్ షా.. బీజేపీలో చేరుతారా?

పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్ జానీ బెయిర్ స్టో హాఫ్ సెంచరీతో మెరిశాడు. 40 బంతుల్లో 56 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 8 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. చివర్లో పంజాబ్ బ్యాటర్లు చెలరేగారు. జితేశ్ శర్మ (18 బంతుల్లో 38 పరుగులు*), భానుక రాజపక్స (18 బంతుల్లో 27 పరుగులు), లియామ్ లివింగ్ స్టోన్ (14 బంతుల్లో 22 పరుగులు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. దీంతో పంజాబ్ భారీ స్కోర్ సాధించింది. ఆఖరి పది ఓవర్లలో పంజాబ్ బ్యాటర్లు 101 పరుగులు సాధించడం విశేషం. శిఖర్ ధావన్‌ 12, మయాంక్‌ అగర్వాల్ 15, రిషి ధావన్‌ 5* పరుగులు చేశారు. రాజస్తాన్ బౌలర్లలో యజువేంద్ర చాహల్ మూడు వికెట్లు పడగొట్టాడు. రవిచంద్రన్ అశ్విన్, ప్రసిధ్ కృష్ణ చెరో వికెట్ తీశారు.

IPL2022 PBKS Vs RR Rajasthan Royals Target 190

వాంఖడే వేదికగ జరుగుతున్న ఈ పోరులో టాస్‌ గెలిచిన పంజాబ్‌ కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఈ సీజన్ లో ఇరు జట్ల విషయానికి వస్తే.. పంజాబ్ జట్టు 10 మ్యాచులు ఆడింది. 5 విజయాలు 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని చూస్తోంది. మరోవైపు రాజస్తాన్ రాయల్స్ జట్టు 10 మ్యాచులు ఆడింది. ఆరు విజయాలతో 12 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ తో పోరులో గెలుపొంది ప్లేఆఫ్స్‌ బెర్తుకు మరింత చేరువ కావాలని రాజస్తాన్ పట్టుదలగా ఉంది.

David Warner: క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్ చేసిన డేవిడ్ వార్నర్

రాజస్తాన్‌ రాయల్స్ జట్టు : జోస్‌ బట్లర్‌, జైస్వాల్‌, సంజూ శాంసన్‌, పడిక్కల్‌, రియాన్‌ పరాగ్‌, హెట్‌మైర్‌‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్డ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, యజువేంద్ర చాహల్‌, కుల్దీప్‌ సేన్‌.

పంజాబ్‌ కింగ్స్ జట్టు : జానీ బెయిర్‌స్టో, శిఖర్‌ ధావన్‌, మయాంక్‌ అగర్వాల్‌, రాజపక్స, లివింగ్‌స్టోన్‌, జితేశ్‌ శర్మ, రిషి ధావన్‌, రబాడ, రాహుల్‌ చాహర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, సందీప్‌ శర్మ.

Delhi Capitals: గంటకు 157కిలోమీటర్ల వేగంతో బౌలింగ్.. IPL 2022 ఫాస్టెస్ట్ డెలివరీ ఇదే

ట్రెండింగ్ వార్తలు