ఐపీఎల్ 2021 వేలం : ఆర్సీబీకి మ్యాక్స్ వెల్‌.. రూ.14.25 కోట్ల ధరకు కొనేసింది

ఐపీఎల్ 2021 వేలం : ఆర్సీబీకి మ్యాక్స్ వెల్‌.. రూ.14.25 కోట్ల ధరకు కొనేసింది

Updated On : February 18, 2021 / 4:35 PM IST

Maxwell sold to RCB: ఐపీఎల్ 2021 మినీ వేలం కొనసాగుతోంది.ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ఐపీఎల్ 2021 వేలంలో అధిక ధర పలికాడు. బిడ్డింగ్ వార్‌లో 14.25 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాక్స వెల్ ను సొంతం చేసుకుంది. రూ.14.25 కోట్లకు మ్యాక్స్ వెల్ ను బెంగళూరు దక్కించుకుంది.

గత ఏడాది సీజన్ వేలంలో మ్యాక్స్ వెల్ కోసం 10.75 కోట్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వెచ్చించింది. రూ.3.20 కోట్లకు షకీబ్ ఉల్ హసన్ ను కోల్ కతా కొనుగోలు చేసింది. తొలి రౌండ్‌లో ఆరోన్ ఫిచ్‌, అలెక్స్ హేల్స్‌, హనుమ విహారి, జేసన్ రాయ్‌లాంటి స్టార్ ఆటగాళ్లపై కూడా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు.

https://10tv.in/ipl-2021-mini-auction-steve-smith-joins-delhi-capital/

2020 ఐపీఎల్ ఎడిషన్‌లో మ్యాక్స్ వెల్ కేవలం 108 పరుగులు చేశాడు. 2012 నుండి ఒక సీజన్‌లో అత్యల్ప పరుగులు నమోదు చేశాడు. ఇందులో అతడు 5+ మ్యాచ్‌లు ఆడాడు. 2013 నుంచి అతడి మొదటి సీజన్ కాగా.. అందులో మ్యాక్స్ వెల్ ఒక్క సిక్సర్ కూడా నమోదు చేయలేదు.

2020లో సీజన్ లో చెత్త ప్రదర్శన కారణంగా పంజాబ్ కింగ్స్ అతన్ని బిడ్డింగ్ లో ఉంచింది. గత సీజన్లలో మ్యాక్స్ వెల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడగా.. కనీస ధర రూ.2. కోట్లు ఫలికాడు. ఇప్పుడు జరిగిన వేలంలో ఆర్సీబీ మ్యాక్స్ వెల్ ను సొంతం చేసుకుంది. మ్యాక్స్ వెల్ తన ఐపీఎల్ కెరీర్ ను 2012లో ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి మొదలైంది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టులో మూడు ఆటలు ఆడాడు. ఏడాది తర్వాత మ్యాక్స్ వెల్ పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకోగా.. 2020లో పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.