IRE vs IND: బుమ్రా రీ ఎంట్రీకి వరుణుడు అడ్డు.. ఐర్లాండ్ తో తొలి టీ20కి వాన ముప్పు

టీమిండియా స్టార్ పేసర్ జ‌స్‌ప్రీత్‌ బుమ్రా పునరాగమనానికి వర్సం అడ్డుపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఐర్లాండ్ తో మొదటి టీ20 మ్యాచ్ కు వాన గండం పొంచివుంది.

IRE vs IND: బుమ్రా రీ ఎంట్రీకి వరుణుడు అడ్డు.. ఐర్లాండ్ తో తొలి టీ20కి వాన ముప్పు

Will rain ruin Jasprit Bumrah comeback in Dublin

Updated On : August 20, 2023 / 11:53 AM IST

IRE vs IND T20: టీమిండియా మెయిన్ బౌలర్ జ‌స్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) రీ ఎంట్రీకి వరుణుడు అడ్డుతగిలేలా కన్పిస్తున్నాడు. దాదాపు ఏడాది త‌రువాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాలన్న బుమ్రా ఆశలను ఆలస్యం చేసేలా కనబడుతున్నాడు. రీ ఎంట్రీలో కెప్టెన్ గా అవకాశం రావడంతో బుమ్రా చాలా ఉత్సాహంగా ఉన్నాడు. యంగ్ ప్లేయర్స్ తో కూడిన టీమ్ కు నాయకత్వం వహించే చాన్స్ దక్కడంతో సద్వినియోగం చేసుకోవాలని అతడు భావిస్తున్నాడు.

మూడు మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్ శుక్రవారం జరగనుంది. డబ్లిన్‌లోని ‘ది విలేజ్’ మలాహైడి క్రికెట్ క్లబ్ గ్రౌండ్‌లో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచివుంది. స్థానిక వాతావరణ శాఖ సమాచారం ప్రకారం డబ్లిన్ లో మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వర్షం పడే అవకాశం 68 శాతం ఉంది. ఈ రోజు వర్షం పడడం ఖాయమని వెల్లడించింది.

ఆసియా కప్, ODI ప్రపంచ కప్ నేపథ్యంలో 29 ఏళ్ల బుమ్రా పునరాగమనం టీమిండియాకు కీలకంగా మారింది. నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో పూర్తిగా కోలుకుని మైదానంలో అడుగుపెట్టేందుకు అతడు రెడీ అయ్యాడు. ఐర్లాండ్ పర్యటనలో సత్తా చాటితే టీమిండియాకు సానుకూలశం అవుతుంది. బుమ్రా రాకతో టీమిండియా పేస్ బౌలింగ్ మరింత పటిష్టమవుతుంది. కాబట్టి ఐర్లాండ్ టూర్.. బుమ్రా ఎంతో కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: నితిన్ పాటకి క్రికెటర్ చాహల్ భార్య మాస్ డాన్స్ అదుర్స్.. రాను రానంటూనే సిన్నదో!

అటు కెప్టెన్ గా బుమ్రా ఎలా రాణిస్తాడనే దానిపై భారత క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొనివుంది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని, మళ్లీ మైదానంలో అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని బుమ్రా మీడియాతో మాట్టాడుతూ చెప్పాడు. పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగేందుకు రెడీ ఉన్నట్టు తెలిపాడు. బుమ్రా రీఎంట్రీ ఈరోజే.. తర్వాతో ఈరాత్రికి తేలనుంది. కాగా, రెండో మ్యాచ్ 20న, మూడోది 23న జరగనుంది.

Also Read: గ‌ట్లుంట‌దీ టీమ్ఇండియాతో మ్యాచ్ అంటే.. హాట్‌ కేక్‌ల్లా అమ్ముడవుతున్న టికెట్లు.. దొర‌క‌ట్లే..!