Vaibhav Suryavanshi : నిన్న సెన్సేషనల్ సెంచరీ.. ఈరోజు జాక్ పాట్ కొట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఏకంగా..
కేవలం 35 బంతుల్లోనే శతకం బాది ఐపీఎల్ లో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు.

Courtesy BCCI
Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2025లో యంగ్ స్టార్లు దుమ్ము లేపుతున్నారు. 14ఏళ్ల చిచ్చర పిడుగు వైభర్ సూర్యవంశీ, 17 ఏళ్ల ఆయుశ్ మాత్రే అదరగొడుతున్నారు. రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడుతున్న వైభవ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతడు సంచలనాలు నమోదు చేస్తున్నాడు. బ్యాట్ తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఇక మాత్రే చెన్నై సూపర్ కింగ్స్ తరపున అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు.
గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. కేవలం 35 బంతుల్లోనే శతకం బాది ఐపీఎల్ లో హిస్టరీ క్రియేట్ చేశాడు. నిన్న సెన్సేషనల్ సెంచరీ చేసిన వైభవ్.. ఈరోజు జాజ్ పాట్ కొట్టేశాడు. ఏకంగా భారత అండర్-19 జట్టు తరపున వైభవ్ ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మాత్రే కూడా.
ఈ ఏడాది జూన్‌లో భారత జూనియర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లండ్‌తో 5 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచులు ఆడనున్నట్లు సమాచారం. ఈ ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లే జట్టులో సూర్యవంశీ, మాత్రేలకు ఛాన్స్ దక్కినట్లు సమాచారం. సూర్యవంశీ గతేడాది స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. ఈ బిహారీ క్రికెటర్ జూనియర్ జాతీయ జట్టు తరపున 2 టెస్టులు, 3 వన్డేలు ఆడాడు.
భారత అండర్-19 బాలుర జట్టు ఈ వేసవిలో ఇంగ్లాండ్‌లో పర్యటిస్తుంది. ఆ జట్టు జూన్ 21న UK చేరుకుంటుంది అని BCCI వర్గాలు తెలిపాయి. ఈ పర్యటన వచ్చే ఏడాది జింబాబ్వే, నమీబియాలో జరగనున్న అండర్-19 వరల్డ్ కప్ కు సిద్ధం కావడానికి భారత అండర్-19 జట్టుకు సహాయపడుతుందని అభిప్రాయపడింది. సూర్యవంశీ, మాత్రే చివరిసారిగా గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన U-19 ఆసియా కప్‌లో భారత U-19 జట్టు తరపున ఆడారు. తమ బ్యాటింగ్ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
చరిత్ర సృష్టించిన సూర్యవంశీ..
14 ఏళ్ల వైభవ్ IPL 2025లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. సోమవారం (ఏప్రిల్ 28) మెన్స్ టీ20 క్రికెట్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర పుస్తకాల్లో తన పేరును నమోదు చేసుకున్నాడు. జైపూర్‌లోని సవాయి మాన్ సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 38 బంతుల్లో 101 పరుగులు చేశాడు. కేవలం 35 బంతుల్లోనే 100 పరుగుల మార్కును దాటాడు.
35 బంతుల్లోనే సెంచరీ చేయడం ద్వారా యూసుఫ్ పఠాన్ ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మన్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. సూర్యవంశీ 7 ఫోర్లు, 11 సిక్సర్లు బాదాడు. ఇది ఐపీఎల్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్‌మన్ మురళీ విజయ్ రికార్డును సమం చేయడంలో అతనికి సహాయపడింది.
మరోవైపు మాత్రే చెన్నై సూపర్ కింగ్స్‌లో అద్భుత ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు. ముంబైకి చెందిన ఈ క్రికెటర్ చెన్నైకి చెందిన ఫ్రాంచైజీలో ప్రత్యామ్నాయ ఆటగాడిగా చేరాడు. ఏప్రిల్ 20న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో 3వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 15 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 32 పరుగులు చేశాడు.