IND vs ENG 2nd Test : ఇలా వికెట్లు గాల్లోకి ఎగరడం చూసి ఎన్నాళ్లయిందో
ప్రస్తుతం క్రికెట్ ఆడేవారిలో అత్యుత్తమంగా యార్కర్లు వేసే వారు ఎవరు అంటే ఠక్కున చెప్పే పేరు జస్‌ప్రీత్ బుమ్రా

Jasprit Bumrah bowls a remarkable yorker to send Ollie Pope’s stump for a walk
Jasprit Bumrah: ప్రస్తుతం క్రికెట్ ఆడేవారిలో అత్యుత్తమంగా యార్కర్లు వేసే వారు ఎవరు అంటే ఠక్కున చెప్పే పేరు జస్‌ప్రీత్ బుమ్రా. భారత పేస్ గుర్రం ఎంతో ఖచ్చితత్వంతో యార్కర్లు వేస్తాడు. అతడి యార్కర్లను ఎదుర్కొనడం హేమాహేమీలైన బ్యాటర్లకు కూడా కష్టమే. తాజాగా రెండో టెస్టు మ్యాచులో ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ ఆటగాడు ఓలిపోప్‌ను అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. బుమ్రా వేసిన ఈ బంతికి ఓలిపోప్ వద్ద సమాధానమే లేకపోయింది.
బుమ్రా ఇన్‌స్వింగ్ యార్కర్ దెబ్బకు వికెట్లు ఎగిరిపడ్డాయి. ఆ బంతిని చూసిన నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బెయిర్‌స్టో సైతం ఆశ్చర్యపోయాడు. కాగా.. ఓలీపోప్‌ను టెస్టుల్లో బుమ్రా ఇప్పటి వరకు ఐదు సార్లు ఔట్ చేయడం గమనార్హం. బుమ్రా.. ఓలీపోప్ ను క్లీన్‌బౌల్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుమ్రా తన కెరీర్‌లోనే వేసిన బంతుల్లో ఇదే అత్యుత్తమ బంతి అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read : అశ్విన్ పై అంపైర్‌కు ఫిర్యాదు చేసిన అండర్సన్.. వీడియో
?? ? ??? ???? ???? ???? ?? ??? ???? ???? ?????? ?? ?????? ?? ??? ?????? ?? ???, ?? ? ?????? ????? ??#??????? #???????? #???????? #??????????? ?? ? ?? pic.twitter.com/tyIfV3LrMu
— Kapil Pratap Singh (@kapil9994) February 3, 2024
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో రోజు టీ విరామ సమయానికి మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ నాలుగు వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. జానీ బెయిర్ స్టో (24), బెన్ స్టోక్స్ (5) లు క్రీజులో ఉన్నారు. అంతకముందు యశస్వి జైస్వాల్ ద్విశతకం (209) బాదడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్ 34, రజత్ పాటిదార్ 32, శ్రేయస్ అయ్యర్ 27, అక్షర్ పటేల్ 27 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్, షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్‌లు తలా మూడు వికెట్లు తీయగా టామ్ హార్ట్లీ ఓ వికెట్ పడగొట్టాడు.
Also Read: ఇలాంటి క్యాచ్ ఎప్పుడూ చూసి ఉండరూ! పక్షిలా గాల్లోకి ఎగిరి..
Timber Striker Alert ?
A Jasprit Bumrah special ? ?
Drop an emoji in the comments below ? to describe that dismissal
Follow the match ▶️ https://t.co/X85JZGt0EV#TeamIndia | #INDvENG | @Jaspritbumrah93 | @IDFCFIRSTBank pic.twitter.com/U9mpYkYp6v
— BCCI (@BCCI) February 3, 2024