IND vs ENG 2nd Test : అశ్విన్ పై అంపైర్‌కు ఫిర్యాదు చేసిన అండర్సన్.. వీడియో
విశాఖ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది.

James Anderson Miffed With R Ashwin's Tricks At Non Striker End
IND vs ENG : విశాఖ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ క్రమంలో ఆటగాళ్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండో రోజు తొలి సెషన్‌లో భారత సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌కు, ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్‌కు మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తొలి సెషన్‌లో అండర్సన్ బౌలింగ్ చేస్తుండగా నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న అశ్విన్ తన చేతిని ముందుకు చాచాడు. బౌలింగ్ రన్నరప్‌లో ఉన్న అండర్సన్ క్రీజు వరకు వచ్చి బంతిని వేయకుండా ఆగిపోయాడు. తన ఏకాగ్రతను దెబ్బతీసేందుకే అశ్విన్ ఇలా చేశాడని అంపైర్‌కు అండర్సన్ ఫిర్యాదు చేశాడు. తాను ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదని అశ్విన్ బదులు ఇచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చిన్నపాటి మాటల తూటాలు పేలాయి.
Viral Video : ఇలాంటి క్యాచ్ ఎప్పుడూ చూసి ఉండరూ! పక్షిలా గాల్లోకి ఎగిరి..
ఆ తరువాత కూడా ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. చివరకు ఏకాగ్రత కోల్పోయిన అశ్విన్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. కాగా.. అండర్సన్ బౌలింగ్‌లోనే అశ్విన్ ఔట్ కావడం గమనార్హం.
— Nihari Korma (@NihariVsKorma) February 3, 2024
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ (209) చేయడంతో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. గిల్ 34, రజత్ పాటిదార్ 32, శ్రేయస్ అయ్యర్ 27, అక్షర్ పటేల్ 27 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్, షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్‌లు తలా మూడు వికెట్లు పడగొట్టగా టామ్ హార్ట్లీ ఓ వికెట్ తీశాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభింన ఇంగ్లాండ్ రెండో రోజు టీ విరామానికి నాలుగు వికెట్లు నష్టపోయి 155 పరుగులు చేసింది. జానీ బెయిర్ స్టో (24), బెన్ స్టోక్స్ (5) లు క్రీజులో ఉన్నారు.
Rishabh Pant : ఎన్నోసార్లు గదిలోకి వెళ్లి ఏడ్చాను.. ఆసక్తికర విషయాలను పంచుకున్న రిషబ్ పంత్