T20 World Cup-2022: టీమిండియా ఫ్యాన్స్‌కు షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు బుమ్రా దూరం

ఆస్ట్రేలియాలో వచ్చే నెల నుంచి జరిగే టీ20 ప్రపంచకప్‌నకు టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా దూరమయ్యాడు. బుమ్రా కొంత కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. తాజాగా మళ్ళీ వెన్నునొప్పి రావడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. దీంతో ఆయన ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ... టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా ఆడే అవకాశం లేదని అన్నారు.

T20 World Cup-2022: టీమిండియా ఫ్యాన్స్‌కు షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు బుమ్రా దూరం

Jasprit Bumrah

Updated On : September 30, 2022 / 6:44 AM IST

T20 World Cup-2022: ఆస్ట్రేలియాలో వచ్చే నెల నుంచి జరిగే టీ20 ప్రపంచకప్‌నకు టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా దూరమయ్యాడు. బుమ్రా కొంత కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. తాజాగా మళ్ళీ వెన్నునొప్పి రావడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. దీంతో ఆయన ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ… టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా ఆడే అవకాశం లేదని అన్నారు.

బుమ్రా వెన్నునొప్పి సమస్య మళ్ళీ తీవ్రమైందని చెప్పారు. బుమ్రా మరో ఆరు నెలలు ఆడతాడా? లేదా? అన్న విషయంపై బీసీసీఐ వైద్య బృందం త్వరలోనే అధికారికంగా నిర్ణయాన్ని వెలువడించే అవకాశం ఉంది. ఇప్పటికే బుమ్రా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ దూరమైన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలో పేసర్లకు అనుకూలించే పిచ్‌లపై టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా అద్భుతంగా రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు భావించారు.

అంతలోనే అతడికి వెన్నునొప్పి తీవ్రతరమైందని తెలియడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. మరోవైపు, ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌నకు టీమిండియా ఆల్‌ రౌండర్‌ జడేజా కూడా దూరయ్యాడు. దీంతో భారత జట్టు ఎలా ఆడుతుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బుమ్రా టీమిండియా ప్రధాన బౌలర్‌గా ఉన్నాడు. అతడి సేవలను కోల్పోవడం టీమిండియాకు గట్టి దెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

“నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”.. https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw