Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా సర్జరీ విజయవంతం.. జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చేది అప్పుడే
న్యూజిలాండ్‌లోని క్రిస్ట్‌చర్చ్ పట్టణంలో బుమ్రాకు సర్జరీ జరిగింది. ఈ శస్త్ర చికిత్స విజయవంతమైనట్లు, దీన్నుంచి ఆయన కోలుకుంటున్నట్లు ఒక స్పోర్ట్స్ మీడియా సంస్థ వెల్లడించింది. బీసీసీఐ పర్యవేక్షణలోనే బుమ్రాకు ఈ సర్జరీ జరిగింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న బుమ్రా పూర్తిగా కోలుకోవడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

Jasprit Bumrah: కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు శస్త్ర చికిత్స పూర్తైనట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్‌లోని క్రిస్ట్‌చర్చ్ పట్టణంలో బుమ్రాకు సర్జరీ జరిగింది. ఈ శస్త్ర చికిత్స విజయవంతమైనట్లు, దీన్నుంచి ఆయన కోలుకుంటున్నట్లు ఒక స్పోర్ట్స్ మీడియా సంస్థ వెల్లడించింది.
International Women’s Day: మహిళల గౌరవార్థం ప్రత్యేక డూడుల్ రూపొందించిన గూగుల్
బీసీసీఐ పర్యవేక్షణలోనే బుమ్రాకు ఈ సర్జరీ జరిగింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న బుమ్రా పూర్తిగా కోలుకోవడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో రాబోయే ఐపీఎల్, ఆ తర్వాత జరిగే ఆసియా కప్‌లో కూడా బుమ్రా ఆడే అవకాశం లేదు. గత ఆగష్టులో గాయపడ్డ బుమ్రా అప్పటి నుంచి ఆటకు దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్-2022, టీ20 వరల్డ్ కప్, తాజా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వంటి కీలక టోర్నీలకు కూడా బుమ్రా దూరమయ్యాడు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ టోర్నీకి కూడా అందుబాటులో ఉండటం లేదు.
International Women’s Day: మహిళా దినోత్సవం సందర్భంగా బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఎక్కడంటే
ఇది ఐపీఎల్‌లో బుమ్రా ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాలి. సర్జరీ పూర్తైన బుమ్రా కనీసం 24 వారాలపాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. దీంతో కనీసం సెప్టెంబర్ వరకు అతడు ఆటకు దూరంగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఆ తర్వాత స్వదేశంలో ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్‌కు మాత్రమే బుమ్రా అందుబాటులోకి వస్తాడు. అంటే ఏడాదికిపైగా బుమ్రా జాతీయ జట్టుకు దూరమవుతున్నాడు.