IPL 2025 : 4 ఓవర్లు, 76 పరుగులు.. ఐపీఎల్ చరిత్రలో ఆర్చర్ చెత్త రికార్డ్..
ఆ ఓవర్ లో ట్రావిడ్ హెడ్ ఏకంగా 5 ఫోర్లు బాదాడు.

Courtesy BCCI
IPL 2025 : ఐపీఎల్ 2025 లో రాజస్థాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ చెత్త రికార్డ్ ను నెలకొల్పాడు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లు వేసి ఏకంగా 76 పరుగులు ఇచ్చాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ఓ స్పెల్ లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ గా జోఫ్రా ఆర్చర్ ఓ చెత్త రికార్డ్ ను తన పేరున నమోదు చేసుకున్నాడు.
ఐపీఎల్ 2025 టోర్నీలో రెండో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం జరిగింది. నాలుగు ఓవర్లు వేసిన ఆర్చర్ ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. ఏకంగా 76 రన్స్ బాదారు బ్యాటర్లు. జోఫ్రా ఆర్చర్ తర్వాత మోహిత్ శర్మ ఉన్నాడు. 2024లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ మోహిత్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓ స్పెల్ లో ఏకంగా 73 పరుగులు ఇచ్చాడు.
జోఫ్రా ఆర్చర్ సమర్పించుకున్న 76 పరుగుల్లో 68 పరుగులు బౌండరీల రూపంలో వచ్చాయి. 11 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. ఈ ఇంగ్లీష్ బౌలర్ ను కెప్టెన్ రియాన్ పరాగ్ 5వ ఓవర్ లో తీసుకొచ్చాడు. తన తొలి ఓవర్ లోనే 23 పరుగులు ఇచ్చాడు ఆర్చర్. ఆ ఓవర్ లో ట్రావిడ్ హెడ్ ఏకంగా 5 ఫోర్లు బాదాడు. ఆ తర్వాత వేసిన ఓవర్ లో ఆర్చర్ 11 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత వేసిన రెండు ఓవర్లలో 22, 23 రన్స్ సమర్పించుకున్నాడు.
Also Read : ఆరెంజ్ ఆర్మీ అదరహో.. రాజస్థాన్ రాయల్స్‌పై ఇలా గెలిచింది..
ఐపీఎల్ చరిత్రలోనే సెకండ్ హయ్యస్ట్ స్కోర్ ను ఎస్ఆర్ హెచ్ నమోదు చేసింది. 20 ఓవర్లలో ఆ జట్టు 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఎస్ఆర్ హెచ్ జట్టులో ఇషాన్ కిషన్ సెంచరీతో చెలరేగాడు.
ఐపీఎల్ లో ఒక స్పెల్ లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్లు..
జోఫ్రా ఆర్చర్ (ఆర్ఆర్) వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ లో 76 పరుగులు
మోహిత్ శర్మ (జీటీ) వర్సెస ఢిల్లీ 2024 లో 73 పరుగులు
బసిల్ తంపి (ఎస్ఆర్ హెచ్) 0/70 వర్సెస్ ఆర్సీబీ 2018 లో 70 పరుగులు
యశ్ దయాల్ (జీటీ) వర్సెస్ కేకేఆర్, అహ్మదాబాద్, 2023లో 69 పరుగులు
రీస్ టోప్లే (ఆర్సీబీ) వర్సెస్ ఎస్ఆర్ హెచ్ బెంగళూరు 2024లో 68 పరుగులు, ఒక వికెట్
లూక్ వుడ్ (ఎంఐ) వర్సెస్ ఢిల్లీ ఢిల్లీ 2024లో 68 పరుగులు, ఒక వికెట్