Kane Williamson : కేన్ విలియమ్సన్ కీలక నిర్ణయం.. ఏంది మామా ఇలా చేశావ్.. ఇంకో నాలుగు నెలలు ఆగాల్సింది..!
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు
Kane Williamson
Kane Williamson : న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచ కప్ కేవలం నాలుగు నెలల ముందు ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. అయితే, వన్డే, టెస్టు ఫార్మాట్‌లలో కొనసాగుతానని స్పష్టం చేశాడు.
35ఏళ్ల విలియమ్సన్ టీ20 ఫార్మాట్లో న్యూజిలాండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయంగా 93 టీ20 మ్యాచ్ లు ఆడిన కేన్ విలియమ్సన్.. 2,575 పరుగులు చేశాడు. ఇందులో 18 హాప్ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 95 పరుగులు. కేన్ విలియమ్సన్ 2011లో జింబాబ్వేపై టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. చివరి మ్యాచ్ ను 2024లో ఇంగ్లాండ్ పై ఆడాడు. కొన్నాళ్లు కెప్టెన్ గా కొనసాగిన అతను.. న్యూజిలాండ్‌ను రెండు ICC T20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్స్ (2016 మరియు 2022), ఫైనల్ (2021) కు నడిపించాడు.
కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ.. చాలాకాలంగా న్యూజిలాండ్ టీ20 జట్టులో భాగస్వామ్యం కావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ జ్ఞాపకాలు, అనుభవాలకు నేను చాలా కృతజ్ఞతుడిని. ఇది నాకు, జట్టుకు సరైన సమయం. నా నిర్ణయం టీ20 ప్రపంచకప్ కోసం బలమైన జట్టు కూర్పుకు ఉపయోగపడుతుంది. చాలా మంది టీ20ల్లో రాణించగలిగే ప్రతిభావంతులు ఉన్నారు. వాళ్లను జట్టులోకి తీసుకురావడానికి, ప్రపంచ కప్‌కు సిద్ధం చేయడం ఎంతో అవసరం. మిచ్ సాంట్నర్ అద్భుతమైన కెప్టెన్. ఈ ఫార్మాట్‌లో బ్లాక్‌క్యాప్స్‌ను ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. నేను మైదానం బయట నుండి మద్దతు ఇస్తాను అంటూ విలియమ్సన్ పేర్కొన్నారు.
🚨 KANE WILLIAMSON ANNOUNCED HIS RETIREMENT FROM T20I 🚨
– Thank you, Kane ❤️ pic.twitter.com/YWrB5Td8vj
— Johns. (@CricCrazyJohns) November 2, 2025
