క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్

Kedar Jadhav: టీ20లో అరంగేట్రం హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జింబాబ్వేతో 2015 జూలై 17న చేశాడు.

క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్

Kedar Jadhav

Updated On : June 3, 2024 / 6:53 PM IST

టీమిండియా ప్లేయర్ కేదార్ జాదవ్ (39) క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని తెలిపాడు. తన కెరీర్ లో మద్దతునిచ్చిన అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. కేదార్ జాదవ్ 2020 నుంచి అంతర్జాతీయ క్రికెట్లో ఆడలేదు. ఆ ఏడాది న్యూజిలాండ్‌పై మ్యాచ్ ఆడాడు.

అదే అతడి చివరి మ్యాచ్. 2019 వన్డే ప్రపంచ కప్‌లోనూ అతడు ఆడాడు. కేదార్ జాదవ్ వన్డేల్లో ఆరంగేట్రం మ్యాచులో 2014 నవంబర్ 16న జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో శ్రీలంకతో ఆడాడు. చివరి వన్డే ఈడెన్ పార్క్‌లో న్యూజిలాండ్ (2020 ఫిబ్రవరి 8న)తో ఆడాడు. టీ20లో అరంగేట్రం హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జింబాబ్వేతో 2015 జూలై 17న చేశాడు.

చివరి టీ20 బర్సపరా క్రికెట్ స్టేడియంలో 2017 అక్టోబర్ 10న ఆస్ట్రేలియాతో ఆడాడు. ఐపీఎల్‌ ఆరంగేట్రం 2010 మార్చి 25న చేశాడు. చివరి ఐపీఎల్ మ్యాచ్ 2023 మే 9న ఆడాడు. టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ లో జాదవ్ ఒకడు. అతడు మొత్తం 73 వన్డేలు ఆడాడు. 2 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు బాదాడు. మొత్తం 1,389 పరుగులు చేశాడు. టీ20ల్లో 9 మ్యాచ్‌లు ఆడి, 122 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

Also Read: యూఎస్‌లో విరాట్ కోహ్లీ భద్రత చూశారా..? గుర్రాలతో చుట్టుముట్టారు.. వీడియో వైరల్