Kieron Pollard : ఇలా బ్యాటింగ్ చేయాలా.. అరెరె ఈ విష‌యం తెలియ‌క ఇన్నాళ్లు.. పొలార్డ్ బ్యాటింగ్ స్టైల్ వైర‌ల్‌..

సాధార‌ణంగా క్రికెట్ మ్యాచుల్లో బ్యాట‌ర్లు వికెట్ల ముందు నిలబ‌డి బ్యాటింగ్ చేస్తుంటారు.

Kieron Pollard : ఇలా బ్యాటింగ్ చేయాలా.. అరెరె ఈ విష‌యం తెలియ‌క ఇన్నాళ్లు.. పొలార్డ్ బ్యాటింగ్ స్టైల్ వైర‌ల్‌..

Kieron Pollard batting stance in Abu Dhabi T10 League viral

Updated On : November 28, 2024 / 1:24 PM IST

సాధార‌ణంగా క్రికెట్ మ్యాచుల్లో బ్యాట‌ర్లు వికెట్ల ముందు నిలబ‌డి బ్యాటింగ్ చేస్తుంటారు. అయితే.. వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండ‌ర్ కీర‌న్ పొలార్డ్ మాత్రం వికెట్ల వెన‌క్కు వెళ్లి మ‌రీ బ్యాటింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గామారింది.

అబుదాబి టీ10 టోర్నీలో ఇది చోటు చేసుకుంది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో బుధ‌వారం యూపీ న‌వాబ్స్‌, న్యూయార్క్ స్ట్రైక‌ర్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో కీర‌న్ పొలార్డ్ సార‌థ్యంలోని న్యూయార్క్ స్ట్రైక‌ర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 74 ప‌రుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో పొలార్డ్ బ్యాటింగ్‌లో దారుణంగా విఫ‌లం అయ్యాడు. 21 బంతులు ఆడి 12 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు.

IND vs AUS : ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. రోహిత్ నేతృత్వంలో కాన్‌బెర్రాలో అడుగుపెట్టిన భార‌త్‌..

కాగా.. పొలార్డ్ బ్యాటింగ్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. క‌నీసం బంతిని బ్యాట్‌తో ట‌చ్ చేసేందుకు అవ‌స్థ‌లు ప‌డ్డాడు. ఒక్క బౌండ‌రీ కూడా కొట్ట‌లేక‌పోయాడు. అయితే.. బ్యాటింగ్ స‌మ‌యంలో బౌండ‌రీ కొట్టేందుకు పొలార్డ్ విఫ‌ల య‌త్నం చేశాడు. బౌల‌ర్ బంతిని వేసే ముందే వికెట్ల వెన‌క్కి వెళ్లాడు. బౌల‌ర్ సైతం తెలివిగా ఆప్ సైడ్ వైడ్‌గా బంతిని వేశాడు. పొలార్డ్ లాప్డెడ్ షాట్‌కు య‌త్నించి విఫలం అయ్యాడు.

పొలార్డ్ ఈ షాట్‌కు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. వికెట్ల ముందు ఉండి బ్యాటింగ్ చేసుకుంటే బంతి బౌండ‌రీకి వెళ్లేది అని ఒక‌రు కామెంట్ చేయ‌గా.. అరెరె ఈ విష‌యం తెలియ‌క ఇన్నాళ్లు వికెట్ల ముందు బ్యాటింగ్ చేసాము అంటూ మ‌రొక‌రు కామెంట్ చేశారు.

IND vs AUS : తొలి టెస్టులో ఓట‌మి.. క్రికెట్ ఆస్ట్రేలియా కీల‌క నిర్ణ‌యం.. అన్‌క్యాప్డ్ ఆట‌గాడికి పిలుపు.. భార‌త్‌కు చుక్క‌లేనా?

ఇక ఈ మ్యాచ్‌లో పొలార్డ్ టీమ్ ఓడిపోయింది. 75 ప‌రుగుల లక్ష్యాన్ని యూపీ న‌వాబ్స్ 6.1 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోయి ఛేదించింది. ఓపెన‌ర్ ర‌హ్మ‌నుల్లా గుర్భాజ్ (21 బంతుల్లో 31 నాటౌట్‌), ఆండ్రీ ఫ్లెచ‌ర్ (6 బంతుల్లో 18 నాటౌట్‌) రాణించారు.