IPL 2023: ఇదేందీ మామ.. గెలిచామన్న ఆనందం లేకుండా చేశారు
మ్యాచ్ గెలిచామన్న ఆనందం లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul)కు కొంతసేపైనా లేకుండా చేశారు. స్లో ఓవర్ కారణంగా అతడికి జరిమానా పడింది.

KL Rahul
IPL 2023: ఉత్కంఠ పోరులో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)పై లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 155 పరుగుల ఛేదనలో రాజస్థాన్ 6 వికెట్ల నష్టానికి 144 పరుగులకే పరిమితమైంది. దీంతో 10 పరుగుల తేడాతో లక్నో గెలుపొందింది. అయితే.. మ్యాచ్ గెలిచామన్న ఆనందం లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul)కు కొంతసేపైనా లేకుండా చేశారు. స్లో ఓవర్ కారణంగా అతడికి జరిమానా విధించారు.
సువాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు నిర్దేశిత సమయంలో తన బౌలింగ్ కోటాను పూర్తి చేయలేకపోయింది. ఈ సీజన్‌లో లక్నో జట్టు స్లో ఓవర్ రేట్ ను నమోదు చేయడం ఇదే తొలిసారి. దీంతో ఆ జట్టు కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్‌కు రూ.12లక్షల జరిమానా విధించినట్లు ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
IPL 2023, RR vs LSG: 10 పరుగుల తేడాతో రాజస్థాన్‌పై లక్నో గెలుపు
ఈ సీజన్‌లో మ్యాచ్‌లు ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగుతుండడంతో నిర్దేశిత సమయంలో మ్యాచ్ లు పూర్తి కావడం లేదు. ఓవర్ల మధ్యలో ఎవరికి బౌలింగ్ ఇవ్వాలి, ఫీల్డింగ్‌ను ఎక్కడ సెట్ చేయాలన్న దానిపై ఆయా జట్ల కెప్టెన్లు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. దీంతో స్లో ఓవర్ కారణంగా జరిమానాలను ఎదుర్కొంటున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై స్లో ఓవర్ రేట్ కారణంగా సూర్యకుమార్ యాదవ్‌కు జరిమానా పడింది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్‌లకు కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ పడింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యాకు జరిమానా పడగా, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు శాంసన్ కు ఫైన్ పడింది.
IPL 2023, RR vs LSG: టేబుల్ టాపర్ల మధ్య సమరం.. విజయం సాధించేది ఎవరో..? హెడ్ టూ హెడ్ రికార్డు
ఓ సీజన్‌లో తొలి సారి స్లో ఓవర్ రేటు నమోదు అయితే ఆ జట్టు కెప్టెన్‌కు రూ.12లక్షల జరిమానా వేస్తారు. రెండో సారి ఇలాగే జరిగితే కెప్టెన్ రూ.24లక్షల జరిమానా జట్టులో మిగిలిన సభ్యులకు ఒక్కొక్కరికి రూ.6లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధిస్తారు. మూడో సారి కూడా సేమ్ సీన్ రిపీట్ అయితే.. కెప్టెన్‌కు రూ.30లక్షల జరిమానాతో పాటు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేదం విధిస్తారు. మిగిలిన సభ్యులకు రూ.12లక్షల ఫైన్ లేదా మ్యాచ్ ఫీజులో 50శాతం కోత పడుతుంది.