క్రీడా జగత్తులో విషాదం : కోబ్ బ్రయంట్ జీవిత విశేషాలు

  • Published By: madhu ,Published On : January 27, 2020 / 04:07 AM IST
క్రీడా జగత్తులో విషాదం : కోబ్ బ్రయంట్ జీవిత విశేషాలు

Updated On : January 27, 2020 / 4:07 AM IST

క్రీడా జగత్తులో తీవ్ర విషాదం నెలకొంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో దిగ్గజ బాస్కెట్ బాల్ ప్లేయర్ కోబ్ బ్రయంట్, కూతురు చనిపోవడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బ్రయంట్, కూతురు జియాను అధికారులు గుర్తించగా, పైలట్ మరియు మరో ఆరుగురు ప్రయాణీకుల గుర్తింపు దొరకడం లేదు.
1978, ఆగస్టు 23వ తేదీన యూఎస్‌లో జన్మించారు.

1996లో బ్రియాంత్ ఎన్‌బీఏలో ఇతను చేరారు. పాఠశాల విద్య ముగియగానే..వెంటనే ఆయన అందులో చేరారు. అతి చిన్న వయస్సులోనే లీగ్ దశల్లో ఆడాడు. 41 ఏళ్ల కొబ్ 20 ఏళ్ల కెరియర్‌లో పలు రికార్డులు సాధించారు. బ్రంట్ 20 ఏళ్ల కెరియర్‌లో ఎన్నో రికార్డులు సాధించారు. నేషల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ తరపున ఆడి ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచారు. 2012 ఒలింపిక్స్‌లో యూఎస్ టీమ్ తరపున ఆడిన కోబ్..రెండు స్వర్ణపతకాలు గెలుచుకున్నాడు. 2016లో NBA నుంచి ఆల్ టైమ్ స్కోరర్‌గా రిటైర్ అయ్యారు. 18 సార్లు ఆల్ టైమ్ స్టార్‌గా నిలిచారు. 

NBA చరిత్రలో గొప్ప ఆటగాడిగా పేరు సంపాదించాడు. అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాళ్లలో బ్రయంట్ ఒకరు. 24, 8 నెంబర్ గల జెర్సీని ధరించి ఆటలో దిగేవాడు. లాస్ ఎంజెల్స్‌ లేకర్స్, గోల్డెన్ స్టేట్ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్రయంట్ కుటుంబంతో కలిసి వచ్చాడు. లాస్ ఏంజిల్స్ మెమోరియల్ కొలిజయంలో జరిగిన ర్యాలీలో బ్రయంట్ జెర్సీలను అభిమానులు ధరించారు.

2009, జూన్ 17వ తేదీన జరిగిన 15వ NBA ఛాంపియన్ షిప్‌‌ గెలవడంతో ఈ ర్యాలీ నిర్వహించారు. 2013, మార్చి 10వ తేదీన లాస్ ఏంజిల్స్‌లోని చికాగలో బుల్స్‌తో జరిగిన NBA ఆట సమయంలో అతని చేసిన విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. 2010, డిసెంబర్ 13వ తేదీన వాషింగ్టన్ గర్ల్స్ క్లబ్‌లో సైనికులు, నిరాశ్రయులైన వారి కోసం ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా..బ్రయంట్‌ను అభినందించారు. రెండు దశాబ్దాలుగా బాస్కెట్‌బాల్‌లో మెరిసిన ఈ అమెరికా ప్లేయర్ 2016లో రిటైర్ మెంట్ ప్రకటించాడు. బ్రయంట్ ఇక లేరనే వార్త అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

Read More : kobebryantrip : బాస్కెట్ బాల్ ప్లేయర్ కోబ్ బ్రయంట్, కూతురు మృతి