డబుల్ హ్యాట్రిక్ రికార్డు కోసం ఎదురుచూస్తున్న కోహ్లీ

పరుగుల యంత్రం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు ఒడిసిపట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతోన్న వన్డే సిరీస్‌లలో చెలరేగిపోతున్న కోహ్లీ డబుల్ హ్యాట్రిక్ రికార్డుకు అడుగుదూరంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరుగుతోన్న 2, 3 వన్డేలలలో వరుసగా 116, 123 సెంచరీలతో మెరిసిపోయాడు.
సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో కంటే ముందు వెస్టిండీస్‍తోనూ హ్యాట్రిక్ సెంచరీలతో మెరిశాడు కోహ్లీ. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడానికి ముందు అంటే అక్టోబర్ 2018లో జరిగిన ఈ సిరీస్‌లో 140, 157, 107 వరుస సెంచరీలతో మెరిశాడు. కాగా, ప్రస్తుతం జరుగుతోన్న 4వ వన్డేలొ సెంచరీ సాధిస్తే హ్యాట్రిక్‌తో పాటు డబుల్ హ్యాట్రిక్ సొంతం చేసుకున్నట్లు అవుతాడు.
ఈ సెంచరీ కోహ్లీ కెరీర్‌లో 67వ అంతర్జాతీయ సెంచరీతో పాటు 42వ వన్డే సెంచరీగా నిలవనుంది. ఇక 4వ వన్డేలో టీమిండియాలో కీలకమార్పు చోటు చేసుకుంది. వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీకి బదులుగా రిషబ్ పంత్ ను కీపర్ గాఎంచుకున్నారు.