డబుల్ సెంచరీల్లోనూ కోహ్లీనే నెం.1

డబుల్ సెంచరీల్లోనూ కోహ్లీనే నెం.1

Updated On : October 11, 2019 / 10:43 AM IST

దక్షిణాఫ్రికాతో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ సాధించాడు. ఆటలో రెండో రోజైన శుక్రవారం 273/3 ఓవర్ నైట్ స్కోరుతో ఆట మొదలుపెట్టిన భారత్.. దూకుడుగా ఆడి 601 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 

కెప్టెన్ కోహ్లీ వ్యక్తిగత స్కోరు 63తో ఇన్నింగ్స్ ప్రారంభించి 295 బంతుల్లోనే 28 ఫోర్ల సాయంతో 200 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టెస్టు కెరీర్‌లో కోహ్లీకి ఏడో డబుల్ సెంచరీకాగా.. భారత్ తరఫున టెస్టుల్లో ఏడో డబుల్ సెంచరీ  నమోదు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా అరుదైన ఘనత సాధించాడు.

శుక్రవారం నాటి తొలి సెషన్‌లోనే 173 బంతుల్లో 100 పరుగుల మైలురాయిని అందుకున్న విరాట్ కోహ్లీ.. మూడో సెషన్ ఆరంభంలోనే విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీని సాధించగలిగాడు. రవీంద్ర జడేజా(91)పరుగుల వద్ద ఉండగా  క్రీజులో కోహ్లీ(254 నాటౌట్) ఉన్నప్పటికీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది భారత్.  

దీంతో డబుల్ సెంచరీలు అత్యధికంగా చేసిన భారత ప్లేయర్ల జాబితాలో కోహ్లీ చేరిపోయాడు. విరాట్ కోహ్లీ తాజాగా ఏడో డబుల్ సెంచరీతో నెం.1 స్థానానికి ఎగబాకాడు. కోహ్లీ తర్వాత సచిన్ టెండూల్కర్ (6), వీరేంద్ర సెహ్వాగ్ (6) డబుల్ సెంచరీలతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలవగా రాహుల్ ద్రవిడ్ 5 డబుల్ సెంచరీలతో మూడో స్థానంలో నిలిచాడు. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ 4 డబుల్ సెంచరీలతో నాలుగో స్థానంలో ఉన్నాడు.