షాకింగ్ వీడియో.. మ్యాచ్ ముగియగానే కేఎల్ రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన లక్నో జట్టు ఓనర్

KL Rahul: ఇటువంటి ఆటతీరు ప్రదర్శించిన కేఎల్ రాహుల్‌ను మందలించకుండా ఎలా ఉంటారని మరికొందరు కామెంట్లు చేశారు.

షాకింగ్ వీడియో.. మ్యాచ్ ముగియగానే కేఎల్ రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన లక్నో జట్టు ఓనర్

KL Rahul

LSG vs SRH: లక్నో సూపర్ జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌పై ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం ఉప్పల్లో జరిగిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 10 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

మ్యాచ్ ముగియగానే కేఎల్ రాహుల్‌తో సంజీవ్ గోయెంకా కోపంగా మాట్లాడారు. దీంతో కేఎల్ రాహుల్ డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చాక అతడితో సంజీవ్ గోయెంకా మాట్లాడితే బాగుండేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. కెమెరా ముందే కేఎల్ రాహుల్ తో సంజీవ్ గోయెంకా గొడవ పడుతున్నట్లు మాట్లాడడం ఏంటని ఐపీఎల్ ఫ్యాన్స్ అంటున్నారు.

ఇటువంటి ఆటతీరు ప్రదర్శించిన కేఎల్ రాహుల్‌ను మందలించకుండా ఎలా ఉంటారని మరికొందరు కామెంట్లు చేశారు. లక్నో సూపర్ జెయింట్స్‌ జట్టు ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడగా ఆరింట్లో గెలిచి ఆరు మ్యాచుల్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో -0.769 నెట్ రన్‌రేట్ తో 6వ స్థానంలో ఉంది.