మాటల యుద్ధం మొదలైంది : వీరూ వెల్‌కమ్‌పై.. హేడెన్ కౌంటర్

మాటల యుద్ధం మొదలైంది : వీరూ వెల్‌కమ్‌పై.. హేడెన్ కౌంటర్

టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్‌కు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సెహ్వాగ్.. డిఫరెంట్ స్టైల్‌లో ట్వీట్లు చేస్తూ అభిమానులను అలరించడమే కాదు. కొత్త గెటప్‌లతో నవ్వు తెప్పిస్తుంటాడు కూడా. ఫిబ్రవరి 24నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా సొంతగడ్డపై మ్యాచ్ ఆడనుంది. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం స్టార్ స్పోర్ట్స్ ఆస్ట్రేలియా వీరూ భాయ్‌తో ఓ యాడ్ చేసింది. 

 

ఆస్ట్రేలియా జెర్సీలతో ఆసీస్ చిన్నారులను ఆడిస్తున్న బేబీ సిట్టర్‌గా సెహ్వగ్ కనిపించాడు. వారికి బ్యాట్ పట్టుకోవడం, బౌలింగ్ వేయడం గురించి శిక్షణ ఇస్తున్నట్లుగా ఆ వీడియో చిత్రకరీంచారు. దానిపై మండిపాటుకు గురైన మాథ్యూ హేడెన్ సెహ్వాగ్‌ను, స్టార్ స్పోర్ట్స్‌ను ఉద్దేశిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. 

‘బాబూ వీరూ.. ఆస్ట్రేలియా జట్టును సరదాగా తీసుకోవద్దు. ప్రపంచ కప్ ట్రోఫీలో ఎవరు ఎవరినీ బేబీ సిట్టర్ చేస్తారో చూద్దువు గాని’ అని బదులిచ్చాడు. 

 

అంతకంటే ముందు స్టార్ స్పోర్ట్స్ తాను పోస్టు చేసిన వీడియోలో.. ‘  ప్రతి చిన్నారికీ ఓ బేబీ సిట్టర్ కావాల్సిందే. భారత్‌లో ఆడేందుకు ఆస్ట్రేలియా వచ్చేసింది. వీరేందర్ సెహ్వాగ్ వారికెలా స్వాగతం పలికాడో చూడండి. ఫిబ్రవరి 24నుంచి భారత్vsఆస్ట్రేలియా మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్‌లో చూడండి’ అంటూ ట్వీట్ చేసింది.