Team india: ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు ముందు భారత్ జట్టుకు బిగ్ షాక్..
నవంబర్ నెలలో భారత్ జట్టు ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మకమైన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టు మ్యాచ్ లు ఆడనుంది.

Team india
Mohammed Shami Injury: భారత్ జట్టు టెస్ట్, టీ20 సిరీస్ లతో బిజీబిజీగా ఉంది. బంగ్లాతో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను ఇప్పటికే క్లీన్ స్వీప్ చేసింది. బంగ్లా జట్టుతోనే మూడు టీ20 మ్యాచ్ ల తరువాత న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడనుంది. అయితే, నవంబర్ నుంచి భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. ఐదు టెస్టు మ్యాచ్ ఈ సిరీస్ భారత్ జట్టుకు ఎంతో ప్రతిష్టాతకమైంది. దీంతో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ నాటికి భారత సీనియర్ పేసర్ హమ్మద్ షెమీ జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీం మేనేజ్ మెంట్ సైతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో షమీని ఆడించాలని పట్టుదలతో ఉంది. అయితే, గాయంతో ఇబ్బంది పడుతున్న షమీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదని సమాచారం.
గత వన్డే ప్రపంచ కప్ తరువాత మహ్మద్ షమీ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో గత ఐపీఎల్ టోర్నీకి కూడా షమీ దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ నాటికి జట్టులోకి షమీ వస్తాడని అందరూ భావించారు. ఆ మేరకు షమీసైతం సన్నద్ధమవుతున్నాడు. ఇప్పడిప్పుడే ప్రాక్టీస్ చేస్తున్న షమీ.. రంజీ ట్రోపీలో ఆడి ఫిట్ నెస్ నిరూపించుకొని ఆసీస్ టెస్టు సిరీస్ నాటికి సిద్ధం కావాలనే లక్ష్యంతో ఉన్నాడు. కానీ, షమీ ఆసీస్ తో టెస్ట్ సిరీస్ కుసైతం అందుబాటులో ఉండరని తెలుస్తోంది. కానీ, ఈ విషయంపై బీసీసీఐ, షమీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
షమీ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో నొప్పిగా అనిపించడంతో వైద్య పరీక్షలు చేయించినట్లు సమాచారం. పరీక్షల్లో వాపు కనిపించినట్లు వైద్యులు వెల్లడించారని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. బీసీసీఐ వైద్యబృందం నిరంతరం షమీని పర్యవేక్షిస్తోంది. త్వరలో షమీ కొలుకొని ఆస్ట్రేలియా సిరీస్ నాటికి ఫిట్ నెస్ నిరూపించుకుంటాడని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి. ఆస్ట్రేలియా లాంటి దిగ్గజ జట్టును ఎదుర్కోవాలంటే భారత్ ఫాస్ట్ బౌలింగ్ బలంగా ఉండాలి. బుమ్రా, సిరాజ్ తో పాటు షమీకూడా జట్టులోకి వస్తే ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేయొచ్చని టీం మేనేజ్ మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి షమీ ఆస్ట్రేలియా సిరీస్ నాటికి కోలుకుంటాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.