క్రికెట్ చరిత్రలో ఇటువంటి ఔట్ చూశారా?

  • Published By: vamsi ,Published On : March 1, 2019 / 01:27 PM IST
క్రికెట్ చరిత్రలో ఇటువంటి ఔట్ చూశారా?

Updated On : March 1, 2019 / 1:27 PM IST

క్రికెట్ చరిత్రలో ఎప్పడూ చూడని అవుట్ ఒకటి చోటుచేసుకుంది. ఉమెన్ క్రికెట్ లో విచిత్ర పరిస్థితుల్లో ఔట్ అయిన ఘటన జరిగింది. ఆస్ట్రేలియా-కివీస్ మహిళా జట్ల మధ్య గురువారం జరిగిన వన్డేలో ఓ వింత ఔట్ చోటుచేసుకుంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఏ ఫార్మాట్‌లోనూ ఇప్పటి వరకు ఇటువంటి అవుట్ నమోదై ఉండకపోవచ్చు. ఇన్నింగ్స్‌ 45వ ఓవర్లో ఆస్ట్రేలియా బౌలర్‌ హీథర్‌గ్రహం వేసిన ఓ బంతిని కివీస్‌ బ్యాట్స్ ఉమెన్ కేటీపర్కిన్స్‌ నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో స్ట్రెయిట్‌ డ్రైవ్‌ ఆడింది.
Read Also : దేశం విడిచి వెళ్లిపో.. పాక్ మహిళను ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు

బంతి సరాసరి నాన్‌స్ట్రైకర్‌ క్యాటీమార్టిన్‌ బ్యాట్‌కు తగిలి గాల్లోకి లేచింది. వెంటనే బౌలర్‌ హీథర్ గ్రహం ఆ బంతిని అందుకోవడంతో పర్కిన్స్‌ వికెట్ ను కివీస్ కోల్పోయింది.  ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఈ మ్యాచ్ లో  న్యూజీలాండ్‌ 50 ఓవర్లకు 323-7తో నిలిచి ఆస్ట్రేలియాకు భారీ టార్గెట్‌ నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ కేవలం 157 పరుగులకే కుప్పకూలడంతో మ్యాచ్ ను కివీస్ కైవసం చేసుకుంది.

Read Also : అభినందన్ కోసం ఎదురుచూస్తోన్న సినీ తారలు