MP Chamala Kiran Kumar Reddy : హెచ్‌సీఏ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.

MP Chamala Kiran Ksumar Reddy fire on HCA
MP Chamala Kiran Kumar Reddy – HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. హెచ్‌సీఏ అండర్ 19లో అవకతవకలు జరిగాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడాకారుల ఎంపిక పారదర్శకంగా జరగట్లేదన్నారు.
హెచ్‌సీఏ అండర్19 క్రికెట్‌లో అసలైన క్రీడాకారులకు ప్రాధాన్యత లేకుండా సెలెక్షన్స్ జరిగాయని ఆరోపించారు. బాధితులు సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. మంచి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను అనైతిక కారణాలను చూపి సెలక్షన్స్ నుండి తప్పించారన్నారు.
ఇదే కదా మాకు కావాల్సింది.. ఫ్రెండ్స్ అయిపోయిన కోహ్లి, గంభీర్.. జోకులేసుకొని తెగ..
అందుకనే ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి వచ్చి హెచ్‌సీఏ సెక్రెటరీ దేవ్ రాజ్ ని కలవడం జరిగిందన్నారు. గత రెండు సంవత్సరాల నుండి జరిగిన టోర్నీల్లోని క్రీడాకారుల డేటా, వారి ప్రతిభ గురించి అడగడం జరిగిందన్నారు. అయితే.. హెచ్‌సీఏలో సెక్రటరీ కీలక పాత్ర పోషించాల్సి ఉండగా అతడికి బదులుగా ప్రెసిడెంట్ వ్యవహరిస్తున్నారు.
ఇక్కడ జరుగుతున్న విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పుకొచ్చారు. హెచ్‌సీఏని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు.