MS Dhoni: శ్రీశాంత్‌తో కలిసి రోడ్ల మీద బైకుపై తిరిగిన ధోనీ.. వీడియో వైరల్  

ధోనీ బైక్ నడుపుతుండగా శ్రీశాంత్ వెనక సీట్లో కూర్చున్నాడు.

MS Dhoni: శ్రీశాంత్‌తో కలిసి రోడ్ల మీద బైకుపై తిరిగిన ధోనీ.. వీడియో వైరల్  

MS Dhoni

MS Dhoni – Sreesanth: టీమిండియా మాజీ క్రికెటర్, ఐపీఎల్ (IPL) లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బైకులు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఝార్ఖండ్ (Jharkhand) రాజధాని రాంచీ(Ranchi)లోని ధోనీ ఫాంహౌస్ లో ఆయనకు పలు రకాల వెరైటీ బైకులు ఉంటాయి.

బైకుపై ధోనీ మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తో కలిసి గతంలో రోడ్లపై తిరిగిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ధోనీ బైక్ నడుపుతుండగా శ్రీశాంత్ వెనక సీట్లో కూర్చున్నాడు. ఈ అరుదైన వీడియోను ఒకరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా, బాగా వైరల్ అవుతోంది.

బైకుపై ధోనీ, శ్రీశాంత్ వెళ్తుండగా కొందరు అభిమానులు ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. సిగ్నల్ వద్ద ధోనీ బైక్ ఆపిన నేపథ్యంలో అభిమానులు ఆయన పక్కనే బైకులు ఆపడాన్ని వీడియోలో చూడొచ్చు.

ధోనీ అన్ని రూల్స్ పాటిస్తూ, హెల్మెట్ పెట్టుకుని బైక్ నడిపాడు. ఐపీఎల్-2023లో ధోనీ టీమ్ చెన్నై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ ముగియడంతో ధోనీ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. గతంలో శ్రీశాంత్ కూడా ఐపీఎల్ లో ఆడాడు.

AI Risk to Humans : ఏఐతో మానవాళికి ముప్పు.. మరో 10ఏళ్లలో వినాశనం తప్పదు.. టాప్ టెక్ సీఈఓల ఆందోళన..!