క్రికెట్ స్టేడియానికి ధోనీ పేరు, ఎక్కడంటే..

క్రికెట్ స్టేడియానికి ధోనీ పేరు, ఎక్కడంటే..

Updated On : February 14, 2019 / 10:13 AM IST

కొన్ని సంవత్సరాలుగా భారత క్రికెట్ తీరుతెన్నులు మార్చేసిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. క్రికెట్ ఐకాన్‌గా నిలిచాడు. కెప్టెన్‌గానే కాదు, కీపర్‌గా, ప్లేయర్‌గానూ సత్తా చాటిన ధోనీ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ప్లేయర్‌గా ఎదిగాడు. మహీ స్వస్థలమైన రాంచీ ధోనీ గౌరవార్థం జార్ఖండ్‌లోని క్రికెట్ స్టేడియానికి ఎంఎస్ ధోనీ పేరు పెట్టాలని తలంచింది. అనుకున్నదే ఆలస్యంగా స్టేడియంలోని సౌత్ స్టాండ్‌ను ఎంఎస్ ధోనీ పెవిలియన్‌గా మార్చేసింది. 

2004 నుంచి ఓ ప్లేయర్‌గా క్రికెట్‌లో దూసుకెళ్తున్న ధోనీ 2007లో కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు. ధోనీ కెప్టెన్సీలో భారత్.. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకున్నాయి. వీటితో పాటుగా 2009లో తొలిసారి నెం.1 టెస్టు జట్టుగా నిలిచింది భారత్. 

మహీ తన టెస్టు కెరీర్‌కు 2014లో రిటైర్మెంట్ ప్రకటించి 2017లో పూర్తి కెప్టెన్సీ బాధ్యతలను విరాట్ కోహ్లీ అప్పగించేశాడు. ధోనీని జార్ఖండ్ రత్నా, పద్మ‌భూషణ్ అవార్డులు గతంలోనే వరించాయి. త్వరలోనే ధోనీ ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతాడంటూ వార్తలు వస్తున్నాయి. 37 ఏళ్లకు అంతే దూకుడుతో కనిపిస్తున్న ధోనీ ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి.