MS Dhoni to play milestone 400th T20 in CSK vs SRH match
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా చెన్నైలోని చెపాక్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య శుక్రవారం మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ధోనికి ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది. ఇది ధోనికి 400 టీ20 మ్యాచ్ కావడం విశేషం. కెరీర్ మైలుస్టోన్ మ్యాచ్‌లో అతడు చెలరేగి ఆడి జట్టుకు విజయాన్ని అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇప్పటి వరకు ముగ్గురు భారత ఆటగాళ్లు మాత్రమే తమ కెరీర్‌లో 400కి పైగా టీ20 మ్యాచ్‌లు ఆడారు. నేడు సన్‌రైజర్స్‌తో మ్యాచ్ ద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో భారత ఆటగాడిగా ధోని రికార్డులకు ఎక్కుతాడు. రోహిత్ శర్మ (456), దినేశ్ కార్తీక్ (412), విరాట్ కోహ్లీ (407) మాత్రమే ధోని కన్నా ముందు ఉన్నారు.
BCCI : ఇక పై ప్రపంచకప్‌లలో భారత్, పాక్ ఒకే గ్రూప్‌లో ఉండవా? ఐసీసీకి బీసీసీఐ లేఖ?
ఇక ఓవరాల్‌గా తీసుకుంటే.. కీరన్ పొలార్డ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు 695 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
ధోని టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. 325 మ్యాచ్‌లకు ధోని సారథ్యం వహించగా 190 మ్యాచ్‌ల్లో విజయాలను అందుకున్నాడు. ఇక వికెట్ కీపర్‌గా 310 కి పైగా ఔట్‌లలో అతడు పాలుపంచుకున్నాడు.
టీ20 క్రికెట్‌లో 400కి పైగా మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు వీరే..
కీరన్ పొలార్డ్ – 695
డ్వేన్ బ్రావో – 582
షోయబ్ మాలిక్ – 557
ఆండ్రీ రస్సెల్ – 546
సునీల్ నరైన్ – 543
డేవిడ్ మిల్లర్ – 528
అలెక్స్ హేల్స్ -494
రవి బొపారా – 478
రషీద్ ఖాన్ – 470
గ్లెన్ మాక్స్‌వెల్ – 465
క్రిస్‌గేల్ – 463
రోహిత్ శర్మ – 456
షకీబ్ అల్ హసన్ – 444
జోస్ బట్లర్ – 442
కొలిన్ మున్రో – 439
మహ్మద్ నబీ – 434
ఇమ్రాన్ తాహిర్ – 429
జేమ్స్ విన్సీ – 424
సమిత్ పటేల్ – 413
డేనియల్ క్రిస్టియన్ – 412
దినేశ్ కార్తీక్ – 412
విరాట్ కోహ్లీ – 408
ఫాఫ్ డుప్లెసిస్ – 407
డేవిడ్ వార్నర్ – 404