BCCI : ఇక పై ప్రపంచకప్‌లలో భారత్, పాక్ ఒకే గ్రూప్‌లో ఉండవా? ఐసీసీకి బీసీసీఐ లేఖ?
గత కొన్నేళ్ల నుంచి భారత్, పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి.

No More IND vs PAK In World Cup Group Stage After Pahalgam Terrorist Attack Report
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. గత కొన్నేళ్ల నుంచి ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి.
జమ్మూకశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో పర్యటకులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడంతో భవిష్యత్తులోనూ భారత్, పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించే ప్రసక్తే లేదని ఇప్పటికే బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బీసీసీఐ మరో నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
🚨 BCCI BOYCOTTS PAKISTAN. 🚨
– There’s speculation that the BCCI has written a letter to the ICC to not club India and Pakistan in the same group at the ICC events. (Cricbuzz). pic.twitter.com/BBfG4gWear
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 24, 2025
ఐసీసీ ఈవెంట్లలోనూ భారత్ గ్రూప్ స్టేజీలో పాక్‌తో అస్సలు ఆడకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే ఐసీసీకి బీసీసీఐ లేఖ సైతం రాసినట్లుగా సమాచారం. భవిష్యత్తులో జరిగే ఐసీసీ ఈవెంట్లలలో (ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటివి) భారత్, పాక్ జట్లను ఒకే గ్రూప్‌లో ఉంచకూడదని అందులో పేర్కొన్నట్లు నివేదికలు తెలిపాయి. కాగా.. దీనిపై బీసీసీఐ వర్గాలు ఇంతవరకు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు.
దీనిపై బీసీసీఐ టాప్ ఆఫీస్ బేరర్ ఒకరు మాట్లాడుతూ.. ‘ఇది చాలా సున్నితమైన అంశం అని చెప్పారు. చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకైతే అలాంటి వార్తల్లో నిజం లేదని భావిస్తున్నా. మున్ముందు ఏం జరుగుతుందో చెప్పలేం.’ అని సదరు అధికారి తెలిపారు.
ఈ ఏడాది పురుషుల విభాగంలో ఐసీసీ ఈవెంట్లు లేవు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుంది. అయితే.. మహిళల విభాగంలో వన్డే ప్రపంచకప్ 2025 జరగనుంది. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో జరగనున్న ఈ టోర్నీకి భారత దేశం ఆతిథ్యం ఇవ్వనుంది.