రోహిత్, డికాక్ అవుట్

రోహిత్, డికాక్ అవుట్

Updated On : May 12, 2019 / 2:28 PM IST

ముంబై ఇండియన్స్ ఆరంభం అదరగొట్టింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై చెన్నైపై విరుచుకుపడ్డారు. డికాక్(29; 17బంతుల్లో 4 సిక్సులు)స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు. తొలి ఓవర్‌ను చాహర్ బౌలింగ్‌లో 2పరుగులతో మాత్రమే పూర్తి చేసిన ముంబై 3వ ఓవర్లో 20పరుగుల రాబట్టి సమం చేసింది. దూకుడు మీదున్న ముంబై ఓపెనర్ డికాక్‌ను 4.5వ ఓవర్లో శార్దూల్ ఠాకూర్ బ్రేక్ వేశాడు. ఆ తర్వాత 3బంతుల విరామానికే రోహిత్(15)వికెట్‌ను చాహర్ పడగొట్టాడు.