MI vs SRH: శతక్కొటిన గ్రీన్.. హైదరాబాద్ పై ఘన విజయం.. ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు అదరగొట్టారు. వాంఖడే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయాన్ని అందుకుంది.

cameron green century (photo @IPL Twitter)
IPL 2023: ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) బ్యాటర్లు అదరగొట్టారు. వాంఖడే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్( Sunrisers Hyderabad)తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయాన్ని అందుకుంది. 201 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి మరో 12 బంతులు మిగిలి ఉండగానే 18 ఓవర్లలో ఛేదించింది. కామెరూన్ గ్రీన్(100 నాటౌట్; 47 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీతో విధ్వంసం సృష్టించగా కెప్టెన్ రోహిత్ శర్మ(56; 37 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడాడు. ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్(25 నాటౌట్; 16 బంతుల్లో 4 ఫోర్లు) దంచికొట్టాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మయాంక్ దగర్‌లు చెరో వికెట్ తీశారు.
MI vs SRH: గ్రీన్ శతకం.. హైదరాబాద్‌పై ముంబై విజయం
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(83; 46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు), వివ్రాంత్ శర్మ(69; 47 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో మెరుపులు మెరిపించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 140 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. మిగిలిన వారిలో క్లాసెన్(18) పర్వాలేదనిపించగా, గ్లెన్ ఫిలిఫ్స్(1), హ్యారీ బ్రూక్(0) లు విఫలం అయ్యారు. ముంబై బౌలర్లలో ఆకాష్ మధ్వల్ నాలుగు వికెట్లు తీయగా, క్రిస్ జోర్డాన్ ఓ వికెట్ పడగొట్టాడు.